క్యారెట్ మన ఆహారంలో ఒక భాగం. క్యారెట్ తో ఎన్నో రకాల వంటకాలు తయారుచెయ్యవచ్చు. కూరల్లోనూ, సలాడ్స్ మరియు కూరలు, జ్యూస్లు ఇలా ఎన్నో రకాలుగా క్యారెట్ని వినియోగిస్తుంటాం. క్యారెట్లో రుచితోపాటు ఎన్నో పోషక విలువలు కూడా దాగి ఉన్నాయి. అయితే క్యారెట్లు విభిన్నమైన రంగుల్లో మార్కెట్లో దర్శనమిస్తాయి, ఈ మధ్య కాలంలో మన సాధారణంగా ఉపయోగించే ఎరుపు, మరియు ఆరంజ్ రంగు క్యారెట్లతోపాటు, నలుపు రంగు క్యారెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అన్ని రంగుల క్యారెట్ల రుచి ఒకేవిధంగా ఉంటుంది అయితే వీటిలోని పోషకవిలువల్లో మాత్రం వైవిధ్యం ఉంటుంది.
నలుపు రంగు క్యారెట్లు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లాక్ క్యారెట్స్ని పర్పుల్ క్యారెట్ అనికూడా పిలుస్తారు. ఈ క్యారెట్లు ఈ రంగును సంతరించుకోవడానికి వీటిలోని అంథోసైనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువుగా ఉండటం దీనికి ప్రధాన కారణం. ఈ పిగ్మెంట్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేసి ఎన్నో రోగాలు రాకుండా నియంత్రించగలదు. ఈ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ అనే క్యాన్సర్ కారకాలను కూడా తగ్గించడంలో తోడ్పడతయి. వీటిని తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాపును తగ్గిస్తుంది:
ఈ బ్లాక్ క్యారెట్లలో ఆంథోసైనిన్ ఎక్కువ ఉండటం వలన, యాంటీఆక్సిడెంట్గా పనిచేసి, దీని వలన శరీంలో జరిగే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి ఎక్కువుగా ఉంటె, కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది, ఈ పరిస్థితి గుండె జబ్బులకు, మరియు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితియ్యవచ్చు. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కలిగే వాపును కూడా తగ్గిస్తాయి.
విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తయి:
బ్లాక్ క్యారెట్స్ ఎన్నో పోషకవిలువలకు మూలం. ఈ రంగు క్యారెట్లలో విటమిన్-ఏ అధికంగా ఉంటుంది, ఇది కంటి చూపును మెరుగుపరచడానికి మరియు శారీరం కాంతివంతంగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ క్యారెట్ తినడం ద్వారా విటమిన్-కే లభిస్తుంది, ఈ విటమిన్ లోపం వలన చిన్న గాయమైన సరే రక్తం గడ్డకట్టకుండా ఎక్కువు రక్తం పోతుంది. చివరిగా నలుపు క్యారెట్లలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పతుంది.
పొట్ట ఆరోగ్యం పెంపొందిస్తుంది:
ఈ బ్లాక్ క్యారెట్లలో డియాట్రీ ఫైబర్ అధికంగా ఉండటం వలన పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలోని ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మలబద్దకాన్ని నియంత్రిస్తుంది. అలాగే రక్తంలోని షుగర్ లెవెల్స్ని తగ్గించి, టైపు-2 డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది.
అయితే ఎన్నో పోషకవిలువలు ఉన్న బ్లాక్ క్యారెట్స్ రోజూ తినొచ్చా అంటే దానికి సమాధానం కాదు అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ క్యారెట్లలో పొటాషియం శాతం ఎక్కువగా ఉండటం వలన కిడ్నీ సంబంధిత వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కానుక కిడ్నీ సంభందిత వ్యాధులు ఉన్నవారు వీటిని తక్కువ తినడం మంచిది. చిన్నపిల్లకు ఈ బ్లాక్ క్యారెట్స్ తినిపించే వారు తగిన జాగ్రత్తలు పాటించాలి, ఎందుకంటే వీటిలో ఎక్కువుగా ఉండే బీటా-కెరోటిన్ కెరోటినేమియా అనే పరిస్థితికి ధారి తియ్యవచ్చు, దీని వలన శరీరం పసుపుఛాయలోకి మారేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అల్లెర్జి ఉన్నవారు ఆహారానిపుణులను లేదంటే డాక్టర్లను సంప్రదించి వీటిని తినడం మంచిది.
Share your comments