Health & Lifestyle

అసలు తలసేమియా వ్యాధి అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?

KJ Staff
KJ Staff

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దవారివరకు ఎన్నో వ్యాధులు తలెత్తుతున్నాయి. వాటిలో కొన్ని వయసురీత్యా మరియు వాతావరణ పరంగా వచ్చేవైతే మరికొన్ని జనుపరంగా వచ్చే వ్యాధులు. వాతావరణ పరంగా వచ్చే వ్యాధులకు చికిత్స ఉంది కానీ జన్యుపరమైన వ్యాధులకు ఎటువంటి చికిత్స లేదు, ఇటువంటి వ్యాధులు వచ్చిన వచ్చినవారు జీవితాంతం ఈ వ్యాధులతో బాధపడుతూనే ఉండాలి.

జన్యు పరంగా సంక్రమించే వ్యాధుల్లో తలసేమిన్ ఒకటి. ఈ వ్యాధితో బాధపడేవారి రక్తం తొందరగా నశిస్తూ ఉంటుంది, దీని కారణంగా నీరసంగా ఉండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది మరియు గుండె జబ్బులు రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారికి తరచు రక్తం ఎక్కిస్తూ ఉండాలి, ఎందుకంటే వీరి శరీరంలో ఏర్పడిన రక్తం వేగంగా నశిస్తూ ఉంటుంది.

తలసేమియా అనేది హీమోగ్లోబిన్ కు సంభందించిన జన్యు పరమైన వ్యాధి. వ్యాధి తీవ్రతను బట్టి మైనర్ మరియు మేజర్ తలసేమియాగ పరిగణిస్తారు. మైనర్ తలసేమియా ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు తొందరగా బయటపడవు కాబట్టి దీనిని ముందే గుర్తించేందుకు వీలుండదు, అదే మేజర్ తలసేమియాలొ ఐతే వ్యాధి లక్షణాలు ఎక్కువుగా ఉండటమే కాకుండా, తొందరగా బయటపడతాయి. ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణమేమిటంటే , రక్తంలో ఆల్ఫా మరియు బీటా అనే రకాల ప్రోటీన్లు రెండేసి చొప్పున ఉంటాయి, ప్రోటీన్ ఏర్పడటానికి యొక్క అవసరం ఉంటుంది. ఈ జన్యువు ఏర్పడటంతో ఏమైనా లోపం ఉంటె వాటి నుండి ఏర్పడే ప్రోటీన్లు కూడా సర్రిగ్గా ఏర్పడవు.

ఆల్ఫా మరియు బీటా ప్రోటీన్లు నిర్మాణం సరిగ్గా జరగనందువల్ల, ఎర్రరక్త కణాలు తొందరగా విరిగిపోవడం, క్షిణించడం జరుగుతుంది దీని వలన శరీరంలో రక్తం యొక్క శాతం బాగా తగ్గిపోతుంది. సాధారణ ఎర్ర రక్త కణాల జీవితకాలం మూడు నెలలు ఉంటుంది, అదే తలసేమియా ఉన్నవారిలో ఎర్రరక్త కణాలు ఏర్పడిన వారం రోజుల్లోనే విచ్చిన్నమవుతాయి, దీని వలన శరీరంలో రక్తం కొరత ఏర్పడి, ఎన్నో దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. దీని కారణంగా ఈ వ్యాధి ఉన్నవారికి తరచూ రక్తం ఎక్కిస్తూ ఉండాలి, లేదంటే తీవ్ర అస్వస్ధతకు గురవుతారు. ఈ వ్యాధి గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది కనుక తరచూ వైద్యున్ని సంప్రదిస్తూ అవసరమైన చికిత్స తీసుకోవాలి. అయితే ఈ తలసేమియా వ్యాధికి చికిత్స ఉంది, ఇందుకోసం రక్తకణాలను ఉత్పత్తి చేసే బోన్ మారో మార్చుకోవాలి, దీనినే బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అని పిలుస్తారు. అయితే ఈ చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంది.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More