Health & Lifestyle

వర్షాకాలంలో చెరుకు రసం తాగుతున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

KJ Staff
KJ Staff

సాధారణంగా వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల మన శరీరం తొందరగా డీహైడ్రేషన్ అవుతుంది. అందుకోసమే చాలా మంది వేసవి కాలంలో వివిధ రకాల పండ్ల రసాలను తాగడానికి ఇష్టత చూపుతుంటారు. ఈ విధమైనటువంటి పండ్ల రసాలలో చెరుకు రసం ఒకటి .ఎంతో సహజసిద్ధంగా లభించే ఈ చెరుకు రసం తాగటానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వేసవికాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం చెరుకు రసం తాగుతాము. కానీ వర్షాకాలంలో చెరుకు రసం తాగటంవల్ల చలువ చేస్తుందని,దానివల్ల అనేక జబ్బులు వెంటాడుతాయని భావించి చాలామంది చెరుకు రసాన్ని దూరం పెడతారు.అయితే వర్షాకాలంలో కూడా చెరుకు రసం తాగడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇక్కడ తెలుసుకుందాం...

వర్షాకాలంలో చెరుకు రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తొందరగా జలుబు చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది పూర్తిగా అపోహ మాత్రమే. చెరుకు రసంలో ఎన్నో ఔషధగుణాలు పోషక విలువలు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి అందుతాయి కనుక వర్షాకాలంలో చెరుకు రసం తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.రుచికి ఎంతో తీపిని కలిగి ఉండే చెరుకురసం మన శరీరంలో కొవ్వును కరిగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

చెరుకులో అధిక మొత్తంలో మనకు ఫైబర్ లభిస్తుంది. ఈ క్రమంలోనే చెరుకు రసం తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు లేకుండా కాపాడుతుంది. అదేవిధంగా కాలేయం ఆరోగ్యానికి చెరుకురసం ఎంతో ప్రయోజనకరమైనది. తరచూ చెరుకు రసం తాగడం వల్ల కాలేయం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మధుమేహంతో బాధపడే వారు చెరుకు రసానికి దూరంగా ఉంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు వారి శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి చెరుకురసం దోహదపడుతుంది. చెరుకు రసం మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఎలాంటి సంకోచం లేకుండా చెరుకు రసం తీసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాప్తిచెందే అంటు వ్యాధుల నుంచి రక్షించడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరచుకోడానికి చెరుకు రసం దోహదపడుతుంది.

Share your comments

Subscribe Magazine