Health & Lifestyle

తినక ముందు వ్యాయామం చేస్తున్నారా... ఈ సమస్యలు తప్పవు!

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో వ్యాయామం మన అందరి జీవితాలలో ఒక భాగమైపోయింది. ఈ రోజుల్లో ప్రజలు వారి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందడానికి వ్యాయామం చేయటం అలవాటు చేసుకుంటున్నారు. అయితే వ్యాయామం కొందరు వారికి వీలు దొరికినప్పుడల్లా చేస్తుంటారు. ఎక్కువమంది ప్రజలు ఉదయం పూట వ్యాయామం చేయటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిది? వ్యాయామం తిన్న తర్వాత చేయాలా తినక ముందు చేయాలా అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...

ప్రస్తుత కాలంలో ప్రజలు అధిక బరువు సమస్యతో చాలా బాధపడుతున్నారు. అయితే ఆ సమస్యను రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గించుకోవడమే కాకుండా బరువును కంట్రోల్ చేయడం వీలవుతుంది. వ్యాయామం అనేది అధిక బరువు సమస్యతో బాధపడే వారు మాత్రమే కాకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి కూడా విముక్తి పొందవచ్చు.

ఈ ఈ క్రమంలోనే ఉదయం పూట చేసే వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు పరిణామాలు కూడా ఉన్నాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో వ్యాయామం చేయటం వల్ల మన శరీరంలోని ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. అందువల్ల మన శరీరంలో కొవ్వు ఎక్కువ జరుగుతుంది.వ్యాయామాలు చేసే వాళ్ళు ఖాళీ కడుపుతో వ్యాయామాన్ని ప్రారంభించటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం పూట అల్పాహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయటం వల్ల మన శరీరంలోని జీర్ణక్రియ ప్రక్రియకు సమస్యలు కలిగే అవకాశం ఉంది. భోజనం తర్వాత వ్యాయామం చేయటం వల్ల అది మన శరీరంలోని ప్రేగుల పై ప్రభావం చూపుతుంది. అయితే కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు ఏమీ తినకుండా వ్యాయామం చేయడం వల్ల ఎక్కువగా అలసిపోవడం మరియు కళ్ళు తిరగటం వంటి సమస్యలు వస్తాయి. అందువలన డయాబెటిక్ పేషెంట్లు వ్యాయామం చేయటానికి ముందు తక్కువ కేలరీలు కల స్నాక్స్ తీసుకుని తర్వాత వ్యాయామం చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine