Health & Lifestyle

గుండె సమస్యలు ఉన్నవారు జీడిపప్పు తినవచ్చా... ఏమంటున్నారంటే?

KJ Staff
KJ Staff

మారుతున్న జీవన గమనంలో పని ఒత్తిడి కారణంగా మనం తీసుకునే ఆహారం సరిపోదు. దీంతో మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక రకాల వ్యాధులకు కారణం అవుతోంది. కావున మన రోజువారి ఆహారంలో పోషకాహార లోపాన్ని సవరించుకోడానికి అత్యధిక పోషక విలువలు ఉన్న జీడి పప్పును తీసుకోవడం వల్ల మన నిత్య జీవక్రియలు సక్రమంగా జరగడానికి అవసరమైన ప్రోటీన్స్,విటమిన్, పొటాషియం, పాస్ఫరస్, ఫైబర్, మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంటూ వంటివి సమృద్ధిగా లభిస్తాయి.

అయితే ప్రతిరోజు జీడిపప్పును తినడం వల్ల శరీర బరువు పెరగడంతోపాటు అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని చాలామంది జీడిపప్పును తినడం మానేస్తున్నారు.అది అపోహ మాత్రమే జీడిపప్పులో అధికంగా ఉండే మెగ్నీషియం మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సమర్ధవంతంగా కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.

జీడిపప్పులో సోడియం శాతం తక్కువ ఉండి పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవారు జీడిపప్పును ఆహారంగా తీసుకోవచ్చు. జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీరంలో క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
జీడిపప్పు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి భవిష్యత్తులో ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Share your comments

Subscribe Magazine