Health & Lifestyle

పుట్టగొడుగులతో క్యాన్సర్ కి చెక్ పెట్టండిలా..!

KJ Staff
KJ Staff

సహజంగా మాంసాహారులు, శాకాహారులు కామన్ గా ఇష్టపడే ఆహారం ఏదైనా ఉందంటే అది పుట్టగొడుగులతో చేసిన ఆహార పదార్థాలే అని చెప్పొచ్చు.పుట్టగొడుగులు రుచికి శాఖాహారానికి, మాంసాహారానికి మధ్యస్తంగా ఉండి అద్భుతమైన ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా కలిగి ఉంటాయి.ముఖ్యంగా పుట్టగొడుగుల్లో ఎర్గోథియనీన్, గ్లుటాథియోన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.

 

తాజాగా పెన్‌ స్టేట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు అందించిన సమాచారం ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 18 గ్రాముల పుట్టగొడుగులు వివిధ రూపాల్లో తినేవారికి క్యాన్సర్‌ ముప్పు 45% వరకు తగ్గుతున్నట్టు గుర్తించారు. పుట్టగొడుగుల్లో సహజంగా ఉండే ఎర్గోథియోనీన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ నివారణకు అద్భుతంగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ బారినపడకుండా పుట్టగొడుగులు మనల్ని కాపాడతాయి అని పరిశోధనలో వెల్లడైందని వివరించారు.

 

అలాగే పుట్టగొడుగుల్లో ఉన్నటువంటి ఎర్గోథియనీన్, గ్లుటాథియోన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మలినాలను తొలగించడమే కాకుండా బయట నుంచి పొంచివున్న ప్రమాదాల వైరస్,బ్యాక్టీరియా నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. కావున పుట్టగొడుగులను తమ రోజువారీ ఆహారంలో తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్య గమనిక అన్నిరకాల పుట్టగొడుగులు తినడానికి పనికిరావు. సాగు ద్వారా పండించిన వాటినే ఎంపిక చేసుకోవడం మంచిది. సహజంగా లభించే పుట్టగొడుగులను అవగాహన లేనప్పుడు తీసుకోకుండా ఉండటమే మంచిది.

Share your comments

Subscribe Magazine