Health & Lifestyle

బరువు తగ్గాలనుకుంటున్నారా... ఈ లడ్డూలు తినాల్సిందే!

KJ Staff
KJ Staff

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్యలు ఊబకాయం,స్థూలకాయం, బరువు పెరగడం. విటి కారణంగా భవిష్యత్తులో బిపి, షుగర్,గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ప్రమాదకర వ్యాధులతో నిత్యం పోరాడాల్సి వస్తోంది. ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా వ్యాయామాలు చేయడానికి సమయం దొరక్క ఇబ్బంది పడుతున్నారు.అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకోవడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి మరిన్ని వ్యాధులకు కారణమవుతుంది.

బరువు తగ్గాలనుకునే వారు కొంత శారీరక శ్రమ కలిగిన నడక , వ్యాయామం చేయడంతోపాటు బరువు తగ్గడంలో సహాయపడే ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాల వంటి పోషకాలు అధికంగా ఉండే గుమ్మడి,చియా, పుచ్చకాయ, అవిసె గింజలను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలని అలాగే గింజలతోపాటు కొంచెం బెల్లం కలుపుకొని లడ్డూల్లాగా తయారు చేసుకొని తినడం వల్ల ఆకలి అనిపించదు. వీటిల్లో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉండడం శరీర బరువు పెరిగే సమస్య ఉండదని
కొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన, రుచికరమైన పోషకాలతో కూడిన లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అన్ని రకాల విత్తనాలను దోరగా వేయించాలి.తరువాత నెయ్యిలో ఓట్స్ వేసి బాగా వేయించి అందులోరుచి కోసం జీడిపప్పు, ఎండుద్రాక్షను బెల్లంపొడి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత దోరగా వేగిన విత్తనాలను ఈ మిశ్రమంలో కలపి
లడ్డూల తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలను తినడం వల్ల తొందరగా శరీర బరువును తగ్గించుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine