Health & Lifestyle

మీ పిల్లలు పొట్టిగా ఉన్నారని బాధపడుతున్నారా.. వారి ఆహారంలో ఇవి చేరాల్సిందే!

KJ Staff
KJ Staff

సాధారణంగా కొందరు పిల్లలు ఎంతో పొట్టిగా ఉంటారు. టీనేజ్ వచ్చే వరకు పిల్లలలో పెరుగుదల ఎంతో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్ దాటిన పిల్లలలో పెరుగుదల ఆగిపోతుంది.యుక్తవయసుకు వచ్చిన పిల్లలలో ఎక్కువగా ఎముకలు కండరాలు దృఢంగా మారుతాయి కనుక వీరిలో ఎక్కువగా ఎత్తు పెరగడానికి అవకాశాలు ఉండవు. ఈ క్రమంలోనే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిలో ఎత్తు పెరగడానికి సరైన ఆహార పద్ధతులను పాటించడం వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు.

సాధారణంగా మనుషులందరూ ఒకే ఎత్తులో ఉండరు పిల్లల ఎత్తు అనేది వారి తల్లిదండ్రుల పై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడంతో సమస్యలు ఉంటాయని భావిస్తారు. మరి ఈ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మన పిల్లలు తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలను చేర్చాలని నిపుణులు చెబుతున్నారు.

ఎత్తు తక్కువగా ఉండే వారు ఎక్కువగా పాల ఉత్పత్తులను తీసుకోవటం ద్వారా ఇందులో ఉన్నటువంటి పోషకాలు ఎత్తు పెరగడమే కాకుండా ఎముకల సాంద్రతను పెంచుతాయని పలు అధ్యయనాలు నిరూపించబడ్డాయి.ఈ క్రమంలోనే పాల పదార్థాలను అధికంగా పిల్లలకు ఇవ్వడం వల్ల పాలలో ఉన్నటువంటి క్యాల్షియం మినరల్స్ పిల్లలలో కణాల పెరుగుదలకు దోహదపడతాయి.

డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తరచూ మన ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.వీటిలో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్​, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, విటమిన్లు, వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. అదేవిధంగా గుడ్లను కూడా మన రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చాలి. గుడ్లలో ఉన్నటువంటి సాచురేటెడ్​ ఫ్యాట్​, ఐరన్​, విటమిన్లు, ఖనిజాలు, కెరోటినాయిడ్లు పిల్లల పెరుగుదలకు దోహదపడతాయి. వీటితోపాటు తాజా పండ్లు, మాంసం చేపలు, ఓట్ మీల్ వంటి ఆహార పదార్థాలను తినటం వల్ల పిల్లలలో అధిక పెరుగుదల కనబడుతుంది.

Share your comments

Subscribe Magazine