Health & Lifestyle

సిలోన్ దాల్చిన చెక్క సాగు/తయారీ

KJ Staff
KJ Staff
Ceylon Cinnamon
Ceylon Cinnamon
దాల్చిన చెక్క ఒక సుగంధ ద్రవ్యం గా అందరికీ సుపరిచితమే. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ బెరడు చెక్క సాగు చాలా సున్నితమైన ప్రక్రియ. ఇది రెండు వేర్వేరు రకాల్లో లభిస్తుంది.
దాల్చిన చెక్క చెట్టు రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాటి ( స్టంప్) కొమ్మలను నరికి వాటి పై ఉండే దళసరి బెరడును తీసేసి లోపలి పొరను వీలైనంత పల్చగా జుగురుతారు. ఆ పలచని పొర ఎంత పల్చగా ఉంటే అంత ఎక్కువ ఖరీదు పలుకుతుంది. కొమ్మలనుండి వేరుచేసిన పొరలను ఎండలో ఆరబెట్టి సన్నని కర్రలుగా(క్విల్స్) తయారు చేస్తారు. ఈ సన్నని కర్రలను సిలోన్ దాల్చిన చెక్క అంటారు.
క్విల్ రూపంలో ఉండే ఈ సిలోన్ దాల్చిన చెక్క తీపి వాసన మరియు లేత గోధుమ రంగుతో ఉంటుంది. ఇది సన్నగా ఉంటుంది మరియు విరిగిపోయే ఆకృతిని కలిగి ఉంటుంది, కాబట్టి ఇది కాఫీ గ్రైండర్ ఉపయోగించి సులభంగా గ్రౌండ్ చేయవచ్చు. 
ఈ క్విల్ దాల్చిన చెక్క వేరు వేరు దేశాల్లో ఆయా దేశాలు సూచించిన నిర్థిష్ట పరిమాణం లో ఉంటుంది.
ఉదాహరణకు, 
• శ్రీలంక : ఇది 0.2 అంగుళాలు (6 మిల్లీమీటర్ల) 
• ఆల్బా: కాంటినెంటల్, ఇది 0.6 అంగుళాలు (16 మిల్లీమీటర్లు)
• మెక్సికన్, ఇది దాదాపు 0.8 అంగుళాలు (19 మిల్లీమీటర్లు)
• హాంబర్గ్: ఇది 1.3 అంగుళాలు (32 మిల్లీమీటర్లు) 
ఇలా నాలుగు రకాలుగా క్విల్ సినమొన్ ని విభజిస్తారు.
దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. అదనంగా, దాల్చినచెక్కలో యాంటీమైక్రోబయల్, క్రిమినాశక, యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ , ఉద్దీపన మరియు రక్తస్రావ నివారిణ లక్షణాలు ఉన్నాయని చాలామంది బయో శాస్త్రవేత్తలు, సౌందర్య నిపుణులు పేర్కొన్నారు. ఈ లక్షణాలు కొన్ని అంటువ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా మారవచ్చు మరియు కొంతమంది ఇది అభిజ్ఞా ప్రాసెసింగ్‌ను కూడా మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ఇలా సినమోన్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Share your comments

Subscribe Magazine