Health & Lifestyle

ఈ డైట్ తో టైప్ 2 డయాబెటిస్ కు చెక్ పెట్టండిలా..?

KJ Staff
KJ Staff

ప్రస్తుత మన జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే రోజురోజుకు టైప్ 2 డయాబెటిస్ బారినపడే వారి సంఖ్య అధికమవుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం 2040 నాటికి సుమారు ప్రపంచ వ్యాప్తంగా 642మిలియన్ల మంది టైప్2 డయాబెటిస్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ప్రస్తుత కాలంలో వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వీటి ద్వారా అనేక రోగాలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి.

ఇటు వంటి ప్రమాదకరమైన టైప్ డయాబెటిస్ ను ఎదుర్కోవడాని చిన్నచిన్న ఆహార నియమాలను పాటించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనీ యూకేకు చెందిన డాక్టర్​ డేవిడ్​ ఉన్విమ్ వెల్లడించారు.సాధారణంగా మన రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగటం వల్ల చక్కెర స్థాయిలు అధికమై దానిద్వారా స్ట్రోక్స్, మూత్రపిండాల పనితీరు తగ్గిపోవడం వంటివి జరగవచ్చు.ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారిలో ఈ టైప్ 2 డయాబెటిస్ తొందరగా వ్యాపించే ప్రమాదం ఉంది కనుక ఈ సింపుల్ డైట్ ఫాలో అవుతూ టైప్ 2 డయాబెటిస్ నుంచి విముక్తి పొందవచ్చని డాక్టర్ డేవిడ్ తెలిపారు.

ఈ క్రమంలోనే తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వు కలిగిన ఆహార పదార్థాల లో ఏది మంచిది అనే విషయంపై పరిశోధనలు జరిపిన అనంతరం డాక్టర్ డేవిడ్ ఈ విషయాలను వెల్లడించారు. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉన్నటువంటి చిరుధాన్యాలను అధికంగా తీసుకున్న వారిలో డయాబెటిస్ తొందరగా కంట్రోల్ అయిందని ఈ అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఫ్యూచర్ లో టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా ఉండటం కోసం ఎక్కువగా తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. పొరపాటున కూడా అధిక మొత్తంలో తృణధాన్యాలు, పెరుగు, చక్కెర, బ్రెడ్, బంగాళాదుంపలు, పాస్తా, బియ్యం వంటి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలకు వీలైనంత వరకు దూరంగా ఉన్నప్పుడే డయాబెటిస్ వ్యాధిని అరికట్టవచ్చు అని నిపుణులు తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine