Health & Lifestyle

పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదా.. ఎందుకు?

KJ Staff
KJ Staff
Drink Water
Drink Water

మనం పండ్లను తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లల్లో శరీరానికి అవసరమైన అనేక రకాలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల పండ్లను నిత్యం తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ద్రవాలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. అయితే, చాలా మంది పండ్లు తిన్న వెంటనే నీరు తాగవద్దని చెబుతుంటారు. అయితే, దానికి గల కారణాలను మాత్రం పూర్తిగా వెల్లడించరు. దీంతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ దానికి ఒక కారణం ఉంది. 

ఏంటంటే.. వైద్యారోగ్య నిపుణులు పండ్లు తిన్న వెంటనే నీరు తాగవద్దని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే పండ్లు విపరీతమైన హైడ్రేటింగ్ శక్తిని కలిగి.. అధిక మొత్తంలో శరీరానికి సరిపడా నీటికి అందిస్తాయి. అందువల్ల పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగవద్దు. పండ్లు తినడం, నీళ్లు తాగడం వంటి అంశాల మధ్య సమయం కనీసం 30 నుంచి 40 నిమిషాల వ్యవధి ఉండాలని వైద్య నిపుణులు, డైటీషియన్లు సూచిస్తున్నారు.

పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. వాటిలో ముఖ్యమైనది జీర్ణ సంబంధ వ్యాధులు. పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ ఎంజైమ్ లను, ఆమ్లాలను పలుచన చేస్తాయి. దీంతో జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా నారింజపండ్లు, క్వినోవా, పుచ్చకాయ, బొప్పాయి, కస్తూరి, పైనాపిల్, స్ట్రాబెర్రీ, మామిడి పండ్లు, దోసకాయ వంటి పండ్లు తిన్న తర్వాత 30 నిమిషాలు నీరు తాగకుండా ఉండాలని సూచిస్తున్నారు.

పండ్లల్లో చెక్కెరలు, ఈస్టులు ఉంటాయి కాబట్టి పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపులో ఇవి పెరిగే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. దీని వల్ల ఆల్కాహాలు, కార్బన్ డై ఆక్సైడ్ వంటివి ఉత్పత్తికి కారణం అవుతాయి.  దీంతో కడుపులో మంట, ఉదరంలో మంట రావడం వంటి శరీరక సమస్యలు తలెత్తుతాయి.  కడుపు ఉబ్బరం కూడా రావచ్చు.  అలాగే, పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల అతిసారానికి దారితీసే అవకాశం అధికంగా ఉంటుందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine