Health & Lifestyle

రాత్రి మిగిలిన అన్నం మరుసటిరోజు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

KJ Staff
KJ Staff

సాధారణంగా చాలా మందికి రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే దాన్ని మరుసటి రోజు ఉదయం తినడం అలవాటుగా ఉంటుంది. ఇలా చద్ది అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని పెరుగుతో మరుసటిరోజు తింటూ ఉండడం మనం చూస్తుంటాము.అయితే ఇలా తినడం వల్ల అనేక సమస్యలు వెంటాడుతాయని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు.

నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో భాగంగా రాత్రి మిగిలిపోయిన అన్నం మరుసటి రోజు తినడం వల్ల అది హానికరంగా మారుతుందని వెల్లడించారు. ఒకసారి వండిన అన్నం కొన్ని గంటల తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే ఆ అన్నం బ్యాక్టీరియాగా మారిపోతుందని, ఇలాంటి అన్నం తినడం వల్ల వాంతులు,కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఒకసారి చేసిన అన్నం కేవలం రెండు గంటల వ్యవధిలో మాత్రమే తినాలి. ఆ తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరుచుకుని తినకూడదు.

ఒకవేళ అన్నం ఎక్కువగా మిగిలి ఉంటే దానిని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకొని తినవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫ్రిజ్లో నిల్వ చేసిన అన్నం ఒక రోజుకు మించి ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచకూడదు. ఈ విధంగా ఫ్రిజ్లో నిల్వ చేసిన అన్నం వేడిచేసి తినాలనుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే వేడి చేసుకుని తినవచ్చునని నిపుణులు తెలియజేశారు. కనుక వీలైనంత వరకు ఎవరు కూడా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకొని మరుసటి రోజు ఉదయం తినకూడదని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine