Health & Lifestyle

పెసరపప్పు తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీ సొంతం!

KJ Staff
KJ Staff

సాధారణంగా దక్షిణాది రాష్ట్రాలలో రోజువారి క్రమంలో తయారు చేసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువ భాగం పెసరపప్పుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే పెసరపప్పుతో వివిధ రకాల ఆహారపదార్థాలను చేసుకుని తినడానికి ఇష్టపడతారు. అయితే పెసరపప్పులో ఎక్కువ భాగం పోషక విలువలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. పెసరపప్పు ఎక్కువభాగం ప్రొటీన్లు ఉండటమే కాకుండా విటమిన్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మాంగనీస్, జింక్ ఐరన్ వంటి పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి.మరి ఇన్ని పోషక విలువలు కలిగినటువంటి పెసరపప్పును ప్రతిరోజూ తినడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

పెసరపప్పులో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదం చేయటమేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీరాడికల్స్ ను బయటకు తొలగించడానికి దోహదపడతాయి. అదేవిధంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.పెసరపప్పులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆకలిని కలిగించే హార్మోనులను ప్రేరేపిస్తాయి. ఈ క్రమంలోనే కొద్ది మొత్తంలో తీసుకున్నప్పటికీ మనకు ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు. అందుకోసమే బరువు తగ్గాలనుకొనే వారికి పెసరపప్పు మంచి ఆహార పదార్థం అని చెప్పవచ్చు. ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పెసరపప్పును ప్రతిరోజు కొంత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.అధికమొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి

Share your comments

Subscribe Magazine