Health & Lifestyle

తిన్న వెంటనే నిద్రపోతున్నారా?.. అర్థరాత్రి తింటున్నారా?

KJ Staff
KJ Staff

పూర్తి ఆరోగ్యంతో ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరంగా ఉంటేనే మనం ఏ పని అయినా చేయగలం. రోజంతా యాక్టివ్‌గా ఉండగలం. ఎలా పడితే అలా.. ఏవి పడితే అవి తింటే ఆరోగ్యంగా ఉండటం కష్టం. మంచి పోష్టికాహారం తీసుకోవడంతో పాటు మనస్సుసు ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఉండవచ్చు. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఏవి పడితే అవి తింటే మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులా పాడుచేసుకున్నట్లు అవుతుంది.

మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రిపూట టైమ్‌కి ఆహారం తీసుకోవాలి. ఉరుగుల పరుగుల జీవితంలో చాలామంది మార్నింగ్ టిఫిన్ మానేసి మధ్యాహ్నం భోజనం తినేస్తారు. ఇంకా కొంతమంది మధ్యాహ్నం భోజనం మానేసి రాత్రి ఎక్కువ తింటారు. మరికొంతమంది ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం తిని డైట్ పేరుతో రాత్రి తినడమే మానేస్తారు.

అయితే టిఫిన్, లంచ్, డిన్నర్ సరైన సమయంలో తినాలి. ముఖ్యంగా రాత్రిపూట చాలామంది చాలా లేట్‌గా డిన్నర్ చేస్తారు. అది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యుల చెబుతున్నారు. నిద్రపోయే రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఇక తిన్న వెంటనే నిద్రపోవద్దని హెచ్చరిస్తున్నారు.

తిన్న వెంటనే నిద్రపోతే శరీరంలో చక్కెర శాతం పెరుగుతుందట. నిద్రపోయే ముందు అతిగా తినడం కూడా మంచిది కాదట. ఇక అర్థరాత్రి ఆహారం తీసుకోకూడదని, ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అర్థరాత్రిళ్లు ఆహారం తీసుకుంటే గుండె సమస్యలు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

టైంపాస్ కోసం అర్థ రాత్రిళ్లు తినే ఫుడ్ మెదడుపై ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందంటున్నారు. అందుకే అర్థరాత్రిళ్లు ఆహారం తీసుకునే అలవాటు ఉన్నవారు మానేయాలని చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine