Health & Lifestyle

ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు రావడానికి కారణం ఏమిటో తెలుసా?

KJ Staff
KJ Staff

మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా మంది వాంతులు చేసుకోవడం చూస్తుంటాము. ఈ విధమైన సమస్య ప్రతి ముగ్గురిలో ఒకరు తరచు ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ విధంగా కారు, బస్సు, రైలు ఏదేనిలోనైనా ప్రయాణం చేసినప్పుడు కొందరికి వాంతులు అవ్వడం చూస్తుంటాము. అయితే ఈ విధంగా ప్రయాణాల్లో వాంతులు కావడానికి కూడా ఒక కారణం ఉంది. మరి ఆ కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

చాలామందికి ప్రయాణం సరిపడక వాంతులవుతాయి, మరి కొందరికి ఆ వాహనంలోని వాసన సరిపడక వాంతులు కాగా, మరికొన్ని సార్లు రోడ్డు ఎగుడుదిగుడులు ఉన్న కారణంగా వాంతులు అవుతుంటాయి. అయితే ఈ విధంగా ప్రయాణాల్లో తల తిరగడం, వాంతులు కావడానికి గల కారణం చెవిలో ఉండే ‘లాబ్రింథైస్‘ (labyrinths) అనే భాగమేనని నిపుణులు తెలియజేస్తున్నారు. మన చెవిలో ఉన్నటువంటి లాబ్రింథైస్ ఉన్న స్థితిలో కన్నా ఏ చిన్న మార్పులు చోటు చేసుకున్న మనకు వాంతి కలుగుతుంది. ఎక్కువగా ప్రయాణాల్లో మహిళలు, చిన్న పిల్లలు వాంతులు ఎక్కువగా చేసుకుంటారు. ఈ విధంగా ప్రయాణాల్లో వాంతులు చేసుకోవడాన్ని"మోషన్ సిక్ నెస్" అని పిలుస్తారు

మనం రోజూ స్నానం చేయకపోయినా, మన చెవిని శుభ్రపరచకపోయినా, లేదా చెవిలో మాటమాటికీ శుభ్రపరుస్తూ ఉన్న చెవిలో ఉన్నటువంటి లాబ్రింథైస్ తన సమతాస్థితిని కోల్పోయి మెదడుకు అందవలసిన సంకేతాలను సరిగా పంపించదు. దీంతో మనకు తల తిరగడం, వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుందని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు ఒకే విధమైన వేగంతో ప్రయాణం చేయలేము కనుక ఈ ప్రభావం మన చెవిలోని కోక్లియా లాబ్రింథైస్ వ్యవస్థపై పడుతుంది. దాంతో వాంతులు అవుతాయి.

Share your comments

Subscribe Magazine