Health & Lifestyle

డస్ట్ అలర్జీతో బాధపడుతున్నారా.... వీటితో చెక్ పెట్టండి!

KJ Staff
KJ Staff

సాధారణంగా చాలా మంది దుమ్ము ధూళి వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు . ఈ విధమైనటువంటి డస్ట్ అలర్జీ రావటం వల్ల తరచూ తుమ్ములు, దగ్గు, ముక్కులు కారడం, కళ్ళు ఎరుపెక్కి మంటగా ఉండటం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ ఏ మాత్రం వీరికి డస్ట్ అలర్జీ తగ్గకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. మరి ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు ఈ క్రింది చిట్కాల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

డస్ట్ అలెర్జీను తగ్గించుకోవడం కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలోకి రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి, అందులోకి రెండు చుక్కలు తేనె కలుపుకొని తాగడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

తేనెలో కూడా అధిక మొత్తంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల అలర్జీని తగ్గించడం కోసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలోకి టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. డస్ట్ అలర్జీ ను తగ్గించడానికి పసుపు నల్ల మిరియాల కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు వేసి బాగా మరిగించాలి. మరిగిన ఈ పాలనలోకి చిటికెడు మిరియాలు రెండు చుక్కల తేనె కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

డస్ట్ అలర్జీతో బాధపడేవారికి కలబంద రసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రతి రోజూ ఒక గ్లాస్ కలబంద రసం తాగడం వల్ల డస్ట్ అలర్జీకి చెక్ పెట్టవచ్చు. కలబంద లోపల ఉన్నటువంటి జల్ తీసుకుని ఒక గ్లాస్ నీటితో మిక్సీ పట్టి ఈ రసాన్ని తాగడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine