Health & Lifestyle

వాడిన నూనెను మరీమరీ వంటకు వాడుతున్నారా.. జాగ్రత్త!

KJ Staff
KJ Staff

ప్రతిరోజు రుచికరమైన వంటల కోసం మార్కెట్లో దొరికే వేరు శెనగ నూనె, కొబ్బరి నూనె,నువ్వుల నూనె,ఆవ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి వంట నూనెలను రిఫయిండ్ ఆయిల్, ఆర్గానిక్ ఆయిల్ వంటి బ్రాండ్లతో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ నూనెలను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం ఉంది. ప్రస్తుత రోజుల్లో కొంతమంది స్వార్థం కోసం తినే ఆహారాన్ని కూడా కల్తీ చేస్తున్నారు అలాగే మనం నిత్యం ఉపయోగించే వంట నూనెలను కూడా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వంట నూనెలు ఎలా కల్తీ చేస్తున్నారు, వాటి వల్ల కలిగే అనారోగ్య కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, క్యాంటీన్లలో ఒకసారి వినియోగించిన వంట నూనెను తక్కువ ధరకే వివిధ రకాల పరిశ్రమలకు అమ్మడం జరుగుతుంది. అయితే అలాంటి వంట నూనెను కొంతమంది సేకరించి తిరిగి ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. వీటి ధర తక్కువగా ఉండడంతో చాలామంది ప్రజలు వీటిని కొని నిత్యం వాడుతుంటారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడడం వల్ల అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

వంట నూనెలు ఏవైనా ఎక్కువసార్లు వేడి చేస్తే
అందులోనున్న విటమిన్స్ నశించడమే కాకుండా అవ్వి అల్డీహైడ్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు, మెదడు వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు కారణమవుతుంది. అలాగే ఎక్కువ సార్లు వేడి చేసిన నూనెను వాడటం వలన హార్మోన్లు, ఎంజైముల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Share your comments

Subscribe Magazine