మనలో చాలా మంది నమ్మే విషయం ఇది . నెరిసిన జుట్టును బయటకు తీస్తే, కొత్త తెల్ల జుట్టు పుట్టుకొస్తుంది అని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. నెరిసిన జుట్టు బయటకు తీయచ్చ? అసలు నిజం ఏంటో తెలుసుకుందాం .
జుట్టు నెరసిపోవడానికి చాలా కారణాలున్నాయి. జుట్టు ఆరోగ్యం కోల్పోయినప్పుడు దాని రంగు మారుతుంది. జుట్టు నెరిసిపోవడం వృద్ధాప్యానికి సంకేతం అని చాలా మంది అనుకుంటారు.అది నిజమే అయినప్పటికీ చిన్న వయసులో కూడా జుట్టు నెరవడం అనేది జరగొచ్చు .వయసు పెరగడానికి మరియు జుట్టు తెల్లబడడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని మీరు అర్థం చేసుకోవాలి. కొందరికి వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరసిపోతుంది, మరికొందరికి జీవనశైలి మార్పుల వల్ల నెరుస్తుంది .
తెల్ల వెంట్రుకలు బయటకు తీస్తే ఎం జరుగుతుంది?
వెంట్రుకల కణాలు దెబ్బతిన్నప్పుడు గ్రేయింగ్ వస్తుంది అంతేకాని తెల్ల వెంట్రుకలను బయటకు తీసేటప్పుడు కాదు. ఫోలికల్ నుండి జుట్టు పెరుగుతుంది. కాబట్టి ఒక వెంట్రుకను తీయడం వలన అది ఇతర వెంట్రుకలు తెల్లగ చేయడం లేదా తెల్ల జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపదం వంటివి వట్టి మాటలు .
అదలా ఉంచితే ,జుట్టు నెరిసినప్పుడు ఎంతమంది జుట్టు ఆరోగ్యం గురించి పట్టించుకుంటారు? అసలు వయసు పై బాదడం కాకుండా జుట్టు నెరవడానికి మిగతా కారణాలు ఏంటో తెలుసా?
ఇది కూడా చదవండి
Haircare: ఉల్లిపాయతో జుట్టుకి ఎన్ని లాభాలో తెలుసా?
జుట్టు నెరవడానికి కారణాలు
ధూమపానం, మద్యం సేవించడం, విటమిన్ల లోపం, చెడు ఆహారం తీసుకోవడం మరియు జుట్టును జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల జుట్టు నెరిసిపోతుంది. ఈ కారణాల వల్ల వెంట్రుకలకు రంగును ఇచ్చే మెలనిన్ పరిమాణం తగ్గిపోయి అకాలంగా నెరవడం జరుగుతుంది.
తెల్లబడిన జుట్టుని ఎం చేయాలి?
నెరిసిన వెంట్రుకలకు భయపడి తీసేస్తూ ఉంటాం . జుట్టు మరీ నెరిసి ఉంటే తీయడం మంచిది కాదు. ఇది జుట్టు మూలాలను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు బట్టతల రావచ్చు. తెల్ల జుట్టును పూర్తిగా వదిలించుకోవడానికి కలరింగ్ మంచి ఎంపిక. లేదా తగిన హెయిర్ స్టైల్ ఎంపిక చేసుకోడం మంచిది.
అకాలంగా జుట్టు నెరవడాన్ని ఎలా నివారించాలి?
వృద్ధాప్యం లేదా జన్యుపరమైన వ్యాధుల కారణంగా జుట్టు నెరిసిపోవడానికి నిర్దిష్టమైన చికిత్స లేదు. ఆహారపు అలవాట్లు మరియు విటమిన్లు లేకపోవడం అకాల జుట్టు నెరుపుకు ప్రధాన కారణాలు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఉదాహరణకు, కూరగాయలు, పండ్లు, గ్రీన్ టీ మరియు సముద్రపు ఆహారం అలవాటు చేసుకోండి. విటమిన్ లోపం ఉన్నవారు పాలు మరియు చీజ్ తినాలి. విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి
Share your comments