చాల మంది టీ, కాఫిలు అధిక మొత్తంలో తాగుతారు, వీటిని తాగకుంటే చాల మందికి రోజు ప్రారంభంకాదు. కొంతమంది అదేపనిగా తాగేవారు ఉన్నారు. అయితే టీ లేదా కాఫీ ఎక్కువగా తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
ఎంతో మంది కాఫీ తాగకుంటే రోజు గడవదు, ఒత్తిడిని పోగొట్టటాడానికి కొంత మంది ఎన్ని కప్పుల కాఫీలు తాగుతారో లెక్కే ఉండదు. ఇలా అధిక మోతంలో కెఫిన్ ని శరీరంలోకి పంపించడం ఎంతోప్రమాదకరం, ముఖ్యంగా భోజనానికి ముందు లేదా తర్వాత ఇలా కాఫీ తాగడం చాల ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) వెల్లడించింది. ఆరోగ్యకరమైన జీవితం కోసం జీవనశైలి మరియు మనం తీసుకునే ఆహరం మంచిదై ఉండాలి. దీనికి సంబంధించి ఆరోగ్యం మెరుగుపడటానికి 17 రకాల మార్గదర్శకాలను ఐసిఎంఆర్ విడుదల చేసింది. ఐసిఎంఆర్ నివేదిక ప్రకారం, భోజనం తిండడానికి ముందు లేదా తిన్నవెంటనే కాఫీ తాగడం ఎంతో ప్రమాదకరమని హెచ్చరించింది.
టీ మరియు కాఫీ లో కెఫిన్ మరియు టెన్నిన్ అనే అంశాలు ఉంటాయి, ఇవి ఆహారం మీద ప్రతికూల ప్రభావం చూపించి హానికరకంగా మారే అవకాశం ఉందని, జాతీయ పోషకాహార సంస్థ (NIN)జరిపిన ఆద్యానంలో తేలింది. సాధారణంగా కాఫీ తగినవెంటనే తక్షణమే శక్తీ వచ్చిన అనుభూతి కలుగుతుంది. కాఫీ లో ఉండే కెఫిన్ అనే మూలకం కేంద్ర నాడి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితోపాటు టానిన్ ఆహారంలో ఉండే ఐరన్ పై ప్రభావం చూపుతుంది, దీని వలన ఆహారంలోని ఐరన్ శాతం తగ్గి, శరీరానికి అవసరమైన ఐరన్ లభించదు.
ఐరన్ రక్తంలో హెంగ్లోబిన్ అనే ప్రోటీన్ తయారీకి అత్యంత కీలకం. రక్తంలో హిమోగ్లోబిన్ లోపిస్తే శరీంలో ఆక్సిజన్ సరఫరా లోపిస్తుంది. ఈ లోపం రక్త హీనతకు దారి తియ్యవచ్చు. తొందరగా అలసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, గుండె స్పందనలో మార్పు, రక్త హీనత మొదలైనవి రక్తహీనతకు సంకేతాలు కావచ్చు.
మన తాగే ఒక కప్పు కాఫీలో 80-120 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది అదే ఒక కప్ టీ లో 30-65 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ప్రమాదకరం కానప్పటికీ అధిక మొత్తంలో తాగితే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. తద్వారా భోజనం తినడానికి ముందు లేదా తిన్న వెంటనే కాఫీ తాగకపోవడం మంచిది అలాగే కెఫిన్ దృష్టిలోపెట్టుకుని వీలైనంత తక్కువ సార్లు వీటిని తాగడం మంచిది.
Share your comments