Health & Lifestyle

ఈ మూడు లక్షణాలు కనిపిస్తే..అది మధుమేహమేనా..!

KJ Staff
KJ Staff

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని బాధిస్తున్న ప్రమాదకర సమస్యల్లో డయాబెటిస్ (చక్కెర వ్యాధి) ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య డయాబెటిస్ .దీన్ని మొదట్లోనే గుర్తించగలిగితే కొంతవరకు అదుపు చేయవచ్చు.డయబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం పాటు మందులు వాడాల్సిందే. అయితే డయాబెటిస్ ఎవరిలో వచ్చే ప్రమాదం ఉందో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోచ్చు.

అన్ని కాలాల్లోనూ నీళ్లు ఎక్కువగా తాగుతున్నప్పటికీ దాహం విపరీతంగా వేయడం, నీళ్లు తాగుతున్నప్పటికీ గొంతు ఆరిపోవడం, పొడి నాలుక వంటి లక్షణాలు ఒకటి రెండు రోజులు ఉంటే పర్వాలేదు. ప్రతి రోజు ఇలాగే ఉంటే మాత్రం వెంటనే డయబెటిస్ టెస్ట్ అవసరం. . మనం నిత్యం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ ఏపని చేయకుండానే త్వరగా అలసిపోతుంటే అప్పుడు డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం మంచిదే.

ఎక్కువ రోజులు చిగుళ్ళ వ్యాధితో బాధ పడడం
రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉన్నాయని భావించవచ్చు. అలాగే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు వంటి సమస్యలు ఉన్న డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. చిన్న వయసులోనే త్వరగా పళ్ళు ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి.

ఇంకా ఏవైనా గాయాలు అయినప్పుడు త్వరగా మానకపోవడం కూడా డయాబెటిస్ లక్షణమే. కంటి చూపు మందగించడం,కాళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు ఉంటాయి.డయాబెటిస్ వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా షుగర్ వ్యాధి రావటానికి ప్రధాన కారణం ఒంట్లో శక్తిని ఖర్చు చేయకపోవడమే.

Share your comments

Subscribe Magazine