Health & Lifestyle

మీ ఎముకలు గట్టిగా ఉండాలంటే ఈ పండ్లు ఎక్కువగా తీసుకోండి..

KJ Staff
KJ Staff
Fruits for bone health
Fruits for bone health

సాధారణంగా గతంలో కొంత వయసు వచ్చిన తర్వాత ఎముకలు బలహీనంగా మారేవి. కానీ ఇప్పుడు తీసుకునే ఆహారం వల్ల చిన్న వయసులోనే ఎముకలు పెళుసుగా మారిపోతున్నాయి.

వీటిని తిరిగి బలంగా మార్చేందుకు కొన్ని రకాల నోరూరించే పండ్లు ఎంతగానో తోడ్పడతాయి. ఒకవేళ మీకూ కీళ్లు, ఎముకలు నొప్పిగా అనిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆస్టియోపొరోసిస్ సమస్య ఎక్కువై చిన్న సమస్య కూడా పెద్దదిగా మారుతుంది. దీనికోసం డాక్టర్ సలహాతో ముందులు వాడడం ఎంత ముఖ్యమో.. మీ ఎముకలను స్ట్రాంగ్ గా మార్చేందుకు ఆహారం తీసుకోవడం కూడా అంతే అవసరం. మరి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మీ ఎముకలు బలంగా మారతాయంటే..

1. స్ట్రాబెర్రీలు

ఎర్రెర్రని స్ట్రాబెర్రీలంటే చాలామంది ఇష్టపడతారు. అవి ఎంతో ఫ్రెష్ గా, నోరూరిస్తూ ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఫ్రీ రాడికల్స్ వల్ల మన శరీరం డ్యామేజ్ కాకుండా ఇవి కాపాడతాయి. వీటిలో క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి వంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొత్త ఎముకలు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దీంతో పాటు రాస్పెర్రీలు, బ్లాక్ బెర్రీల వంటివాటిలోనూ క్యాల్షియం స్థాయులు ఎక్కువగానే ఉంటాయి. ఒక్కో బెర్రీలో ఇరవై మిల్లీగ్రాముల కంటే ఎక్కువగానే క్యాల్షియం ఉంటుందట.

2. యాపిల్

మార్కెట్లో సంవత్సరం మొత్తం కనిపించే పండ్లలో యాపిల్ పండ్ల గురించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయినా మీరు వాటిని తినట్లేదంటే మీరు చాలా కోల్పోతున్నట్లే లెక్క. యాపిల్స్ లో క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.

3. బొప్పాయి

తియ్యగా, నోరూరించే బొప్పాయి చాలామందికి ఇష్టం. దీనిలో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అందుకే చాలామంది దీన్ని ఇష్టపడుతుంటారు. ఇందులోని విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎముకలు, చర్మ ఆరోగ్యం కాపాడేందుకు బొప్పాయి ఎంతగానో సహాయపడుతుంది.

4. పైనాపిల్

పైనాపిల్ చాలామందికి ఇష్టమైన పండు.. అందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. డైటరీ పొటాషియం యాసిడ్ లోడ్ ని, తద్వారా క్యాల్షియం స్థాయులు తగ్గడాన్ని ఆపగలదని చాలా అధ్యయనాల్లో తేలింది. అంతే కాదు.. అందులో విటమిన్ ఎ, క్యాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు బలమైన ఎముకలను కాపాడేందుకు తోడ్పడతాయి.

5. టొమాటో

టొమాటోలో విటమిన్ కె, క్యాల్షియం, లైకోపీన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కలిపి బలమైన ఎముకల నిర్మాణంలో తోడ్పడతాయి. ఎముకల్లో వచ్చే సమస్యలను తొందరగా రిపేర్ చేస్తాయి. వీటిని సలాడ్లు, కూరలు, సూపులు, జ్యూసులు, చట్నీలు వంటివన్నింటిలో ఉపయోగించవచ్చు.

6. ఆప్రికాట్స్

క్యాల్షియం ఎక్కువగా ఉండే పండ్లలో ఆప్రికాట్స్ ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఇ వంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యంతో పాటు కంటి, చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వీటిని సలాడ్స్ లో, బ్రేక్ ఫాస్ట్ సెరెల్స్ లో కలిపి తీసుకోవచ్చు.

7. కివీ

కివీ పండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందన్న సంగతి మనలో చాలామందికి తెలిసిందే. అయితే ఈ పండ్లలో క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇందులో ఒక్కో పండులో 60 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉండడం విశేషం. అందుకే కివిని అలాగే తినడం లేదా జ్యూస్ రూపంలో తాగడం చేయవచ్చు. కివీ పండ్లను సలాడ్ లో భాగంగా కూడా తీసుకోవచ్చు.

8. ఆరెంజ్

నారింజ పండ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు? తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఉండే ఈ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చాలామంది ఉదయాన్నే వీటిని తీసుకుంటూ ఉంటారు. అయితే కేవలం విటమిన్ సి మాత్రమే కాదు.. క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది.

7. లిచీ

మిగిలిన పండ్లతో పోల్చుకుంటే ఇందులో క్యాల్షియం స్థాయులు కాస్త తక్కువగానే ఉన్నా మిగిలిన పండ్లతో కలిపి తీసుకున్నప్పుడు పోషకాలను ఎక్కువగానే అందిస్తుంది. అందుకే దీన్ని ఫ్రూట్ సలాడ్ లో భాగంగా తీసుకునేందుకు ఆసక్తి చూపించండి.

ఇలా రంగురంగుల పండ్లు ఉపయోగించి ఎముకలను బలంగా మార్చుకోవచ్చు. వీటిని రోజు లేకపోతే వారంలో నాలుగైదు సార్లైనా సరే తీసుకోవడం మంచిది.

https://krishijagran.com/agripedia/6-rare-fruits-in-india-you-must-know-about/

https://krishijagran.com/health-lifestyle/5-fruits-to-keep-you-healthy-in-summers/

Share your comments

Subscribe Magazine