Health & Lifestyle

ఒత్తిడి తగ్గాలంటే ఈ పని చెయ్యండి!

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో ఉరుకులు పరుగుల జీవితం కారణంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ విధంగా ఒత్తిడికి లోనవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే మనుషులు ఒత్తిడికి లోనవడం సర్వసాధారణం. మరి మనకి కలిగిన ఒత్తిడి తగ్గాలంటే సరిగా మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారం మనలో ఒత్తిడి కలగడానికి, ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తుంది. మరి మనలో కలిగే ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలో ఇక్కడ కలుసుకుందాం..

మనం అధిక ఒత్తిడికి లోనైతే ముందుగా ఐస్ క్రీం దూరంగా పెట్టాలి. ఐస్ క్రీం తినడం వల్ల కేవలం మన శరీరం మాత్రమే చల్లబడుతుంది గాని మన మెదడు రిఫ్రెష్ కాదు. మనపై అధిక ఒత్తిడి ఉన్నప్పుడు మన శరీరంలో బిపి పెరుగుతుంది. ఇలాంటి సమయంలోనే జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఒత్తిడి తగ్గకుండా మరింత ఎక్కువ అవడానికి కారణం అవుతుంది. అలాగే జ్యూస్లు కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. జ్యూస్ లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వల్ల మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరిగి అధిక ఒత్తిడిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఆల్కహాల్ వంటి వాటిని కూడా దూరంగా పెట్టడం ఎంతో మంచిది.

మన శరీరంపై అధిక ఒత్తిడి కలిగినప్పుడు ఎక్కువగా పాలకూర, బీన్స్, బ్రోకలీ వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.సెరటోనిన్, డోపమైన్ లాంటి రిలాక్సేషన్ హార్మోన్స్ ని తక్కువగా విడుదల కావడం వల్ల మనం తరచూ ఒత్తిడికి గురవుతుంటారు.అయితే మన ఆహారపదార్థాల్లో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల తిరిగి ఈ హార్మోన్ సరైన మోతాదులో విడుదల చేయడానికి దోహదపడుతుంది.

మనం అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మనకు ఒత్తిడిని కలిగించే సందర్భాలను తగ్గిస్తాయి.ఒత్తిడి నుంచి దూరం కావాలంటే జ్యూస్ ఐస్ క్రీమ్ ను దూరం పెట్టాలి కానీ, డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. డార్క్ చాక్లెట్ లో కొకోవా ఉండటం వల్ల మనకు అధిక ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంది. చివరిగా మన రోజువారీ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం వల్ల మనలో కలిగే ఒత్తిడిని మాయం చేస్తుంది.

Share your comments

Subscribe Magazine