వాటర్ ఆపిల్ వీటినే మనం గులాబీజామకాలు అనికూడా పిలుస్తాం. వీటిని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు, పేరేదైనాసారె వీటిని తినడం ద్వారా లభించే పోషకాలు మాత్రం ఒకటే. ఇవి సాధారణంగా వేసవి కాలంలో లభిస్తాయి, మార్కెట్లోని మిగిలిన ఫలాలతో పోలిస్తే వీటిధార కూడా తక్కువే, పైగా వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటం విశేషం.
వాటర్ ఆపిల్ సీసనల్ గా దొరికే ఫలం, ఇవి వేసవికాలంలో ఎక్కువ కనిపిస్తాయి. ఇవి వివిధ ఆకృతుల్లో, పచ్చ మరియు పింక్ రంగుల్లో లభిస్తాయి. వీటి గుజ్జులో అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది, మరియు వీటి రుచి కాస్త పులుపు మరియు తీపిని కలిగిఉంటుంది. వీటిని ఈ వేసవికాలంలో తినడం చాల ఉపయోగకరం, అధిక నీటి శాతం ఉండటం వలన శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది,దీని వలన మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంది. వాటర్ ఆపిల్ లో నీటితోపాటు శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా లభిస్తాయి. అధిక మొత్తంలో విటమిన్-ఏ, సి శరీరంలో రోగనిరోధక శక్తీ పెరగడానికి, చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడతయి.
వాటర్ ఆపిల్ శరీరానికి అవసరమైన యాంటియోక్సిడెంట్స్, ఫ్లవనోయిడ్స్, ఫినోలిక్ ఆసిడ్స్ కి నిలయం, వీటి ద్వారా దీర్ఘకాలిక రోగాల నుండి మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా వీటిలో ఫైబర్ శాతం కూడా ఎక్కువ కనుక మనం తినే ఆహారం సరైన రీతిలో జీర్ణమై, అజీర్తి సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
పొటాషియం రక్త ప్రసరణను సరైన విధంగా జరిగేలా చేసి, హై బ్లడ్ ప్రెషర్ నుండి కాపాడుతుంది, దీని వలన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాటర్ ఆపిల్ ద్వారా పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. వాటర్ ఆపిల్ లో ఉండే క్వేర్స్టిన్, కంప్పేరోల్ అనే కీలకమైన కాంపౌండ్లు, యాంటీ ఇంఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి, వాపును తగ్గిస్తుంది. నోటి ఆరోగ్యం మెరుగుపడటానికి, మరియు దంతాలు ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా వాటర్ ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది.
Share your comments