Health & Lifestyle

MotoCorp Electric Bike:ఎలక్ట్రిక్ బైక్..ప్రభుత్వం నుంచి రూ. 40 వేల సబ్సిడీ!

S Vinay
S Vinay

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ ధర సుమారు రూ.1.65 లక్షలు ఉంటుందని, ప్రభుత్వ ఆదేశం ప్రకారం రూ.40,000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి చదవండి.

2019లో ప్రారంభమైన Svitch బైక్, ప్రస్తుతం దాని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో నాలుగు బైక్‌లను కలిగి ఉంది -- XE+, XE, MXE మరియు నాన్-ఎలక్ట్రిక్ NXE . ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో కొత్త EV స్టార్టప్ కంపెనీ అయిన స్విచ్ మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బైక్ (Svitch MotoCorp Electric Bike) కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

ఈ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ -బైక్ CSR 762 అతి త్వరలో లాంచ్ అవ్వనుంది. ఈ బైక్ గరిష్టంగా 120kmph వేగాన్ని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ తో సుమారుగా 110km వరకు వస్తుంది. దీని ధర రూ. 1.65 లక్షలు కాగా, దానిపై రూ. 40,000 సబ్సిడీ లభిస్తుంది.

గుజరాత్‌లోని సనంద్ తయారీ కేంద్రంలో ఈ ఎలక్ట్రిక్ బైకులు ఉత్పత్తి చేయబడుతున్నాయి. సమాచారం ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో కంపెనీ 130 కంటే ఎక్కువ డీలర్లు మరియు పంపిణీదారుల నెట్‌వర్క్‌ని కలిగి ఉంది.

ఈ-బైక్ స్పోర్ట్స్, రివర్స్, పార్కింగ్ మోడ్‌లతో రానుంది. 3 kW పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ (PMS) మోటార్ కాకుండా, బైక్ సెంట్రల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగిఉంది. భారతీయుల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండేళ్లపాటు శ్రమించి ఈ బైక్ ని రూపొందించడం జరిగిందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సబ్సిడీ ని అందిస్తుంది.

అహ్మదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు స్విచ్ మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బైక్ CSR 762కి సంబంధించిన ప్రాజెక్ట్‌లో రూ. 100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు గతంలోనే తెలిపింది.

మరిన్ని చదవండి.

LIC బీమా రత్న: LIC సరికొత్త పాలసీ...ప్రయోజనాలు తెలుసుకోండి!

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని తెరవండి, ప్రతి నెలా 50 వేలకు పైగా సంపాదించండి!

Share your comments

Subscribe Magazine