Health & Lifestyle

ఎక్కువ ఆవలింతలు గుండె సమస్యలకు దారితీస్తాయా.. నిజమెంత?

KJ Staff
KJ Staff

సాధారణంగా ఏ వ్యక్తికైనా ఆవలింపులు రావడం సర్వసాధారణమే. సాధారణంగా ఒక వ్యక్తి ఎంతో అలసిపోయినప్పుడు, తన శరీరానికి విశ్రాంతి కావాలనే సంకేతాన్ని ఆవలింపు రూపంలో మనిషికి తెలియజేస్తుంది. అయితే నిద్రపోతున్న సమయంలో కూడా ఆవలింపులు వస్తే అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఆవలింపు ఎక్కువగా వస్తే గుండె సమస్యల బారిన పడతారని నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా ఒక వ్యక్తికి గుండె సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వారి ఆహార విషయంలో కానీ, అధిక శరీర బరువు పెరగడం వల్ల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా తరచూ చాతిలో నొప్పి రావడం సర్వసాధారణం. అయితే ఈ లక్షణాలలో ఆవలింపు కూడా ఒకటి. ఒక వ్యక్తికి ఎక్కువగా ఆవులింతలు వస్తున్నాయంటే అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మన శరీరంలో మెదడు నుంచి ఉదయం వరకు వేగస్ నాడి ఉంటుంది. మనం తరచూ ఆవలించడం వల్ల ఆ ప్రభావం వేగస్ నాడీ పై పడుతుంది.ఆ సమయంలో గుండె చుట్టూ రక్తప్రవాహం అధికంగా ఉంటే ఛాతిలో నొప్పి కలిగి హార్ట్ స్ట్రోక్ రావడానికి ఆవులింత కారణమవుతుంది. కనుక ఎక్కువగా ఆవలింపులు వస్తున్నాయి అంటే మంచి కార్డియాలజిస్ట్ దగ్గరకు వెళ్లి సరైన చికిత్స చేయించుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine