Health & Lifestyle

డెలివరీ తర్వాత ఈ మార్గాల్లో సులువుగా బరువు తగ్గండి?

KJ Staff
KJ Staff

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య హఠాత్తుగా బరువు పెరగడం. ముఖ్యంగా మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో వారి శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి వ్యత్యాసం కారణంగా డెలివరీ తర్వాత చాలామందిలో శరీర బరువు విపరీతంగా పెరుగుతోంది.అంతేకాదు తల్లిగా పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకోవడంలో తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతుంది. అలాగే ఆ సమయంలో శారీరక శ్రమ కలిగిన వ్యాయామం నడక వంటివి చేయలేకపోవడంతో శరీరంలో ఫ్యాట్ బాగా పెరిగి అతి బరువు సమస్య ఏర్పడుతోంది. ఈ విధంగా అధిక బరువుతో బాధపడే మహిళలు సులువుగా కొన్ని వంటింటి చిట్కాలు ఉపయోగించి సహజ పద్ధతిలో శరీర బరువు తగ్గించుకోవచ్చు ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

* ప్రెగ్నెన్సీ తర్వాత మహిళలు మానసిక ప్రశాంతత అలవర్చుకొని స్వల్ప శారీరక శ్రమ కలిగిన చిన్న చిన్న వ్యాయామాలు, మెడిటేషన్ , ఉదయం సాయంత్రం కొంత దూరం నడక వంటివి చేస్తూ ఉంటే శరీరంలో హార్మోనుల సమతుల్యత ఏర్పడి బరువు పెరిగే సమస్య ఉండదు.

* గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.కావున శరీర బరువును వేగంగా తగ్గిస్తుంది.అలాగే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. కనుక ప్రతి రోజు గ్రీన్ టీలో తేనె కలిపి సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి బరువు సమస్య తగ్గుతుంది.మన వంటింట్లో ఉన్న దివ్య ఔషధాలు దాల్చిన చెక్క, లవంగాలకు చెడు కొలెస్ట్రాల్ను సమర్థవంతంగా కరిగించే గుణం ఉంది. కావునఒక గ్లాసు నీటిలో 2 నుంచి 3 లవంగాలు వేసి దాల్చిన చెక్క ముక్క వేసి బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

పై తెలిపిన చిట్కాలను పాటించటం ద్వారా డెలివరీ తర్వాత అధిక బరువు పెరిగిన మహిళలు సులభంగా వారి బరువును తగ్గించుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine