Health & Lifestyle

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ.. మెడ నొప్పి నడుము నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Srikanth B
Srikanth B

ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా తమ రోజువారీ కార్యకలాపాలను ఇంటినుంచే కొనసాగిస్తున్నారు. ఎక్కువ సమయం కదలకుండా ఒకేచోట కంప్యూటర్, ల్యాప్ టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల వెన్నునొప్పి, మెడ నొప్పి ,నడుము నొప్పి, వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట కంఫర్ట్ గా ఉన్న కుర్చీలో సరి అయిన పొజిషన్లో కూర్చోవాలి.అలానే మీ మోకాళ్ళు కుర్చీకి ఆనుకునే విధంగా ఏర్పాటు చేసుకొని కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించవచ్చు. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చుని పని చేయడంతో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది.ఒత్తిడి పెరిగిన భాగంలో నొప్పి మరీ ఎక్కువై రక్తప్రసరణ వ్యవస్థకు ఇబ్బంది కలగవచ్చు. అలాగే కూర్చీలో కూర్చుని కాళ్లను ప్రతిసారి ముందుకు వెనక్కు అనడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించవచ్చు.

మీ PM KISAN రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయారా? తిరిగి పొందండి ఇలా...

ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల వెన్నెముకపై అధిక ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంది కావున మధ్య మధ్యలో విరామం తీసుకోవడం మంచిది. స్వల్ప విరామం తీసుకోవడం వల్ల పని ఒత్తిడి ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. కంప్యూటర్ స్క్రీన్ కు కంటికి మధ్య సరైన దూరం పాటించాలి, స్క్రీన్ కు సరైన పొజిషన్లో కూర్చోవడం వల్ల కంటి మొదలైన సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే ప్రతిరోజూ ఉదయం సాయంత్రం స్వల్ప శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, యోగా, నడక వంటివి పాటించడం వల్ల శారీరక మానసిక సమస్యలను తరిమికొట్టొచ్చు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్య సలహాలు పాటించడం మంచిది.

మీ PM KISAN రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయారా? తిరిగి పొందండి ఇలా...

Share your comments

Subscribe Magazine