Health & Lifestyle

ఈ కాంబినేషన్లు అస్పలు ప్రయత్నించొద్దు.

KJ Staff
KJ Staff
Never try these food with combinations
Never try these food with combinations

చాలా రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. అవి విడివిడిగా తిన్నప్పుడు ఆరోగ్యానికి మంచి చేసే ఈ ఆహార పదార్థాలు రెండు కలిపి తిన్నప్పుడు ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారతాయి.

ఇవి సైన్స్, అనుభవం, పెద్దల సూచనల మేరకు అస్సలు తీసుకోకూడని కాంబినేషన్స్ గా నిలిచిపోయాయి. మరి, ఇలాంటి కాంబినేషన్లు ఏంటో.. అవి ఎందుకు తినకూడదో తెలుసుకుందాం..

అరటి పండు, పాలు:

చాలామంది అరటి పండ్లు పాలు కలుపుకొని షేక్స్ కూడా చేసుకొని తాగుతుంటారు. కానీ నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం ఈ కాంబినేషన్ సరికాదట. అరటి పండు, పాలు కలిపి తీసుకోవడం వల్ల ఇది శరీరంలోని జీవ క్రియలను, జీర్ణ వ్యవస్థను నెమ్మదిగా మారుస్తుందట. పచ్చి అరటి పండు తీసుకుంటే ఇది ఇంకా ఎక్కువవుతుందట. అంతేకాదు.. వీటిని తీసుకోవడం వల్ల క్యాలరీలు ఎక్కువగా అందుతాయి. అందుకే ఇప్పటివరకు మనకు అరటి పండ్లు, పాలు కలిపి తీసుకోవడం అలవాటు ఉన్నా ఇప్పటి నుంచి వాటిని కలిపి తీసుకోకపోవడం అలవాటు చేసుకుంటే మంచిది.

పుదీనా, సోడా:

చాలామంది ఎండాకాలంలో చల్లచల్లని నిమ్మకాయ, పుదీనా సోడా తాగడం ఇష్టపడతారు. ఇంకొందరు మెంటాస్, కోక్ కలుపుకొని తీసుకుంటారు. కానీ ఇలా పుదీనాను ఈ డ్రింక్స్ తో పాటు తీసుకోవడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి సైనైడ్ విడుదలవుతుందట. అందుకే మీ సోడాలో నిమ్మరసం కలుపుకోండి కానీ పుదీనాకి దూరంగా ఉండండి.

పాలు, నిమ్మరసం:

పాలలో నిమ్మరసం చల్లి వివిధ రకాల వంటలు చేయడం మనకు తెలిసిందే. అయితే కొంతమందికి పాలను జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. వీరినే లాక్టోజ్ ఇంటాలరెంట్ పీపుల్ అని పిలుస్తారు. ఇలాంటివారు ఇలాంటివి తినడం వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటివి ఎదురవుతాయి. అందుకే పాలు తాగిన కనీసం గంట వరకు కూడా నిమ్మరసం, నారింజ రసం, పైనాపిల్ జ్యూస్ వంటివి తీసుకోకూడదు.

భోజనంతో పాటు పండ్లు:

చాలామంది భోజనం పూర్తయ్యాక ఏదైనా మిఠాయి తినడానికి ఇష్టపడతారు. మరికొందరు పండ్లను తింటుంటారు. కానీ ఇలా భోజనం పూర్తయ్యాక పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయట. పండ్లు భోజనం చేసిన కొన్ని గంటల వరకు తీసుకోకూడదు. పండ్లు చాలా తొందరగా అరిగిపోతాయి. అయితే ధాన్యాలు, మాంసం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అవి తిన్న తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణ కోశంలోనే ఈ పండ్లు పులిసిపోయి జీర్ణ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ రెండింటికీ కాస్త గ్యాప్ ఇవ్వడం మంచిది.

బాదం, జీడి పప్పు:

సాధారణంగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి తినడం చాలామందికి అలవాటు. కానీ ఈ రెండూ కలిపి తీసుకోవడం సరికాదు. బాదం పప్పులు కొన్నింట్లో చేదు సైనైడ్ ఉంటుంది. పచ్చి జీడి పప్పులో కూడా ఇలాంటి విషపూరితమైన కంపౌండ్స్ ఉంటాయి. అందుకే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం సరికాదు. ఇవి వేర్వేరుగా తీసుకోవడం మంచిది.

కూల్ డ్రింక్స్, ఆహారం:

చాలామంది ఆహారం తింటూ భోజనం చేస్తుంటారు. కానీ ఇది చాలా చెత్త కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచుకోవాలి. ఈ డ్రింక్స్ కడుపులోని యాసిడ్లను డైల్యూట్ చేస్తాయి. దీనివల్ల ఆహారం అరగడం ఇబ్బందిగా మారుతుంది. అంతేకాదు.. ఇది ఆహారం ఎక్కువగా తినలేకుండా చేస్తుంది.

ఆల్కహాల్ టైలెనాల్:

ఎసిటమినోఫెన్ అనే మందును టైలెనాల్ అని పిలుస్తారు. ఈ మందును ఆల్కహాల్ తీసుకున్న కొన్ని గంటల వరకు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఈ రెండూ కలిపి తీసుకోవడం సరికాదు.

బీన్స్, ఛీజ్:

బీన్స్, ఛీజ్ రెండూ ఒకేసారి తీసుకోవడం వల్ల మీ జీర్ణ శక్తి తగ్గుతుంది. రెండు మూడు రోజుల వరకు ఈ ఇబ్బంది అలాగే ఉంటుంది. వీటిని సింగిల్ గా అరిగించుకోవడానికే జీర్ణ వ్యవస్థకు చాలా సమయం పడుతుంది. అదే రెండు కలిపి తీసుకుంటే మరింత ఇబ్బందికి గురికావాల్సి ఉంటుంది. అందుకే ఈ రెండూ కలిపి తీసుకోకూడదు.

బర్గర్, ఫ్రైస్:

సాధారణంగా ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లగానే ఈ కాంబినేషన్ ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు చాలామంది. అయితే స్టార్చ్, ప్రొటీన్లు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయదు. వీటితో పాటు డ్రింక్ కూడా తీసుకోవడం వల్ల మరింత ఇబ్బంది ఎదురవుతుంది.

మాంసం, స్టార్చ్:

మాంసంలో ప్రొటీన్లు, ఫ్యాట్లు వంటి వాటితో పాటు క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో పాటు స్టార్చ్ ని కూడా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి తగ్గుతుంది. అందుకే వీలైనంత వరకు మాంసం తీసుకున్నప్పుడు బంగాళాదుంపలు, పండ్లు వంటి స్టార్చ్ (పిండి పదార్థాలు) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఈ రెండింటి గుణాలు వేరుగా ఉంటాయి. స్టార్చ్ వేగంగా అరుగుతుంది. అది కూడా చిన్న పేగులో దీని అరుగుదల జరుగుతుంది. మాంసంతో దీన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీరం దీన్ని ఎలా జీర్ణం చేసుకోవాలా అని కన్ఫ్యూజన్ కి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

ఈ కాంబినేషన్స్ తీసుకునే ముందు కాస్త ఆలోచించి.. కొన్ని గంటల పాటు గ్యాప్ తో తీసుకోవడం మంచిది.

https://krishijagran.com/health-lifestyle/can-we-eat-fish-and-milk-food-together-know-the-truth/

https://krishijagran.com/health-lifestyle/banana-and-milk-why-you-should-never-consume-these-two-things-together/

Share your comments

Subscribe Magazine