Health & Lifestyle

ఈ ఆహారంతో సెలీనియం లోపాన్ని జయించడండి...

KJ Staff
KJ Staff

ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి, మనం తినే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారంలోని పోషకాలు మరియు ఇతర ఖనిజాలు శరీర పనితీరును పెంచి రోగాల భారిన పడకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఆరోగ్యం బాగుండాలి అని కోరుకునేవారు తమ ఆహారంలో సెలీనియం తప్పకుండా చేర్చుకోవాలి. శరీరంలో వచ్చే పలు అనారోగ్య సమస్యలను నయంచేయ్యడంలో సెలీనియం ఎంతగానో తోడ్పడుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

సెలీనియం లోపిస్తే డిఎన్ఏ రిపేర్ దెబ్బతింటుంది, మన శరీరంలో జరిగే ఆక్సీకరణ డిఎన్ఏ దెబ్బతినడానికి ప్రధాన కారణం. సెలీనియం లోపం వలన డిఎన్ఏ దెబ్బతినడమే కాకుండా ఎన్నో ప్రాణాంతకవ్యాధులు సంభవించే ప్రమాదం ఉంటుంది, వీటిలో క్యాన్సర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధులు రాకుండా ఉండాలన్న డిఎన్ఏ రిపేర్ సరిగ్గా జరగాలన్న సెలీనియం ఖనిజాన్ని ఆహారం ద్వారా తీసుకోవాలి. అయితే ఈ సెలీనియం ఖనిజం లభించడానికి కొన్ని ఆహారపదార్ధాల్ని మన ఆహారంలో చేర్చుకోవడంతో లభిస్తుంది.

కోడి గుడ్డు:

కోడి గుడ్డులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు గుడ్డును తినడం మూలాన శరీరానికి కావల్సిన సెలీనియం లభిస్తుంది. దీనిని రుచిపరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యకరంగా కూడా మేలైనదిగా పరిగణిస్తారు. దీనీతిపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ కోడి గుడ్డులో ఉన్నాయి. ఒక్క కోడి గుడ్డులో సుమారు 15 మైక్రోగ్రాముల సెలీనియం ఉంటుంది.

చీజ్:

పాల ఉత్పత్తుల్లో ఒక్కటైనా పన్నీర్ మరియు చీజ్, సెలీనియం కు మంచి మూలం. ఈ ఉత్పత్తులు శరీర సెలీనియం అవసరాలను తీర్చడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా కాపాడగలదు. 100 గ్రాముల చీజ్ లో 20 మైక్రోగ్రాముల సెలీనియం ఉంటుంది.

పాలకూర:

ఆకుకూరలు తినడం కళ్ళకు ఎంతో మంచిదని చెబుతారు, వీటిని తరచూ తినడం ద్వారా శరీరంలో అవసరాలకు సరిపోయేంత సెలీనియం లభిస్తుంది. 200 గ్రాముల పాలకూరలో 11 మైక్రోగ్రాముల సెలీనియం లభిస్తుంది, కాబట్టి ఆకుకూరలను ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోండి.

Related Topics

#Selenium #Health #Food #Diet

Share your comments

Subscribe Magazine