Health & Lifestyle

దోమల నివారణకు హంటింగ్ చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు..

KJ Staff
KJ Staff

దోమలు మానవ శరీరానికి ఎంతగా ప్రభావం చూపిస్తాయో అందరికీ తెలుసు. ఇక వాటి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ఎన్నో రకాల ఫీవర్ లు వస్తుంటాయి. ఇక వీటి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమల ప్రభావం మాత్రం తగ్గటం లేదు. ప్రతి ఒక్క చోట వీటి సమస్య ఎక్కువగా ఉండడంవల్ల ప్రజల ప్రాణాల మీదికి వస్తున్నాయి. దీంతో వీటిని నివారించడానికి మస్కిటో హంటింగ్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.

మామూలుగా ఫీవర్ కి సంబంధించిన సర్వేలు, వైరస్ కి సంబంధించిన సర్వేలు.. ఇలా కొన్ని కొన్ని సర్వేలు చేస్తుంటాం. కాని ప్రస్తుతం మస్కిటో సర్వే కూడా మొదలవగా.. దోమలు కూడా ఎక్కువగా ఇళ్లల్లో ఉంటున్నాయని గుర్తించారు. అందుకు ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. వేర్ అర్ యు గో వి ఫాలో యు అంటూ మస్కిటో హంటింగ్ చేస్తున్నారు. ఈ హంటింగ్ ని చూసి షాక్ లో ఉంటున్నారు ప్రజలు.

34 వేల హాట్ స్పాట్ లతో 100 రోజుల వరకు ప్రత్యేక కార్యచరణకి సిద్ధమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ నేపథ్యంలో సర్వేలో వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం.. 360 - అతి సమస్యాత్మక ప్రాంతాలు, 5325- కన్స్ట్రక్షన్ స్లైట్లు, 3272- పాఠశాలలు, 764 - ఫంక్షన్ హాల్స్, 3348- సెల్లర్ లు, 5385- ఓపెన్ ప్లాట్స్, 16,192- తాళం వేసిన ఇళ్లులు వంటివి దోమలకు అడ్డాగా మారాయని తెలిపారు. ఈ ప్రాంతాల్లో లార్వా పూర్తిస్థాయి దోమగా మారుతుందని తెలిపారు. వైరల్ ఫీవర్ లాంటివి దోమల వ్యాప్తి వల్లే కారణం అని తెలుసుకొని 100 రోజుల ప్రత్యేక కార్యచరణకు సిద్ధమయ్యారు.

ఇక వీటి కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయగా 360 ప్రాంతాలలో తగిన చర్యలు తీసుకున్నారు. ఇక 477 ప్రాంతాలు ఉండటంతో అక్కడ మరిన్ని దోమల వృద్ధి ఎక్కువగా ఉందని గుర్తించారు. అక్కడ ప్రజలు పలు జాగ్రత్తలతో ఉండాలని లేదంటే వైరల్ ఫీవర్ లు వంటివి వచ్చే ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ఇక మరోవైపు కొందరు స్థానికులు ఎప్పుడో ఒకసారి వచ్చి మామూలుగా చూస్తుంటారని.. దాని వల్ల దోమల ప్రభావంలో మార్పులు లేవని దీనివల్ల ఎంతో ఇబ్బందులు అవుతున్నాయని ప్రశ్నించగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

 

Share your comments

Subscribe Magazine