Health & Lifestyle

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు !

Srikanth B
Srikanth B

త్వరలో రాష్ట్రంలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి.తెలంగాణలో రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈసందర్భంగా బీజేపీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుంటే..బీజేపీ ప్రభుత్వం పేదల నుంచి దోచుకుని కార్పొరేట్లకు పంచుతోందని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరికి వరదలు సంభవించాయని..ఐనా ఎలాంటి ప్రాణ నష్టం కల్గకుండా చూశామన్నారు మంత్రి హరీష్‌రావు.

ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇరుగుపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డిలో మంచినీటి వాటర్ ట్యాంక్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మొక్కలు నాటారు. డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. త్వరలో రూ.50 కోట్లతో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, రూ.15 కోట్లతో మంచి నీటి సరఫరా అందిస్తామన్నారు.

Ration card new rule:రేషన్ కార్డుదారులకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. వాస్తవానికి, ఇప్పుడు గ్రామస్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ తూకం కోసం ఎలక్ట్రానిక్ యంత్రాన్ని కేంద్రం తీసుకురానుంది.దీని కారణంగా రేషన్ సరఫరాలో పారదర్శకత ఏర్పడనుంది.

రేషన్ తూకం వేసే యంత్రం
జాతీయ ఆహార భద్రతా నిబంధనల ప్రకారం రేషన్ హోల్డర్లకు సరైన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండేలా కేంద్రం రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ స్కేల్స్ రూపంలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్‌ను తీసుకురానుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్య వలన రేషన్ పంపిణీలో జరిగే మోసాలను మరియు అవకతవకలను ఆపడానికి దోహదపడుతుంది.



రేషన్ పంపిణీ నియమం ఏమిటి
కేంద్ర ప్రభుత్వం ప్రకారం, చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఆహార ధాన్యాల పంపిణీలో పారదర్శకత ప్రధానం.జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి కిలోకు రూ. 2-3 చొప్పున సబ్సిడీపై ఐదు కిలోల ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తోంది.

రేషన్ కార్డు లో కొత్త నియమం ఇక నుండి ఆ సమస్య ఉండదు!

ఆహార భద్రతకి గరీబ్ కళ్యాణ్ యోజన హామీ
మార్చి 2020లో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు అదనపు పరిమాణంలో ఆహార ధాన్యాలను అందించడానికి కేంద్రం PMGKAY పథకాన్ని ప్రారంభించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రతి లబ్ధిదారునికి నెలకు 5 కిలోల ఆహారధాన్యం అందిస్తున్నారు.

రేషన్ కార్డు లో కొత్త నియమం ఇక నుండి ఆ సమస్య ఉండదు!

Share your comments

Subscribe Magazine