Health & Lifestyle

తలనొప్పికి చక్కటి పరిష్కార మార్గమే... ఈ చేపలు!

KJ Staff
KJ Staff

సాధారణంగా కొందరు తరచూ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ విధమైన తలనొప్పితో బాధపడేవారు తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఏవేవో చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా మరికొందరు వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మనం చూస్తుంటాము. తీవ్రంగా తలనొప్పి సమస్యతో బాధపడేవారు తలనొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలిగించే చక్కటి మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం...

తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు వారి ఆహారంలో భాగంగా అవిసె గింజలు,అక్రోట్ల , చేపలను తరచూ తీసుకోవాలి.ముఖ్యంగా అధిక తలనొప్పి సమస్యతో బాధపడేవారు చేపలను అధికంగా తీసుకోవటం వల్ల ఈ తలనొప్పి సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. చేపలలో ఉండేటటువంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మనలో తలనొప్పి నుంచి విముక్తిని కల్పిస్తాయని యూఎన్‌సీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు గుర్తించారు.

చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కణస్థాయిలో వాపు ప్రక్రియ తగ్గే విధంగా చేస్తాయి. దీంతో తలనొప్పి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు తెలియజేశారు.ఈ క్రమంలోనే అధికమైన తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి సమస్యతో బాధపడే వారు వారి ఆహారంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన చేపలను తీసుకోవాలని నిపుణులు ఈ సందర్భంగా సూచించారు. ఈ విధమైనటువంటి ఆహారంతో పాటు మనం ప్రశాంతగా ఉండటం కోసం యోగ వంటి వాటిని చేయడం ద్వారా ఈ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine