Health & Lifestyle

ఈ హైవేకి షార్ట్కట్లే కాదు... మలుపులు కూడా ఉండవు

KJ Staff
KJ Staff

సుధూర ప్రాంతాలకు ప్రయాణం చెయ్యాలంటే హైవే పై ప్రయాణం సజావుగా సాగుతుంది. మాములు మార్గాల కంటే హైవే మీద ప్రయాణిస్తే గమ్య స్థానాలకు వేగంగా చేరుకోవచ్చు. సాధారణంగా హైవే మీద మలుపులు చాల తక్కువ, కాకపోతే ఎక్కడో ఒక చోట మలుపులు తగలడం సర్వసాధారణం. కానీ సౌదీ అరేబియాలోని ఒక హైవేలో మాత్రం దీనికి భిన్నంగా, కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఒక్క మలుపు కూడా ఉండదు. చాల దూరం నిటారుగా సాగే ఈ హైవే గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సౌదీ అరేబియాలో ఉన్న రబ్ అల్ ఖాలీ అనే ఎడారి ప్రాంతంగుండ సాగే ఒక హైవే కి మాత్రం సుమారు 256 కిలోమీటర్ల వరకు ఒక్క మలుపుకూడా ఉండదు. ఈ హైవే మీద ప్రయాణిస్తున్నంతసేపు మార్గం నిలువుగానే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపొడవైన మలుపులు లేని హైవే గా, గిన్నిస్ బుక్ లో స్థానం కూడా సంపాదించుకుంది. 256 కిలోమీటర్లు ఉండే ఈ హైవే 10 పై ఎటువంటి మలుపులు లేకపోవడంతో పాటు ఎత్తుపల్లాలు కూడా ఉండవు.

అంతేకాకుండా ఎడారి ప్రాంతంకావడం మూలాన, మార్గమధ్యంలో ఎటువంటి చెట్లు కనిపించవు, కేవలం ఇసుక దిమ్మెలు మధ్య ఈ ప్రయాణం కొనసాగించాలి. మధ్యలో ఎటువంటి కట్టడాలు ఉండవు, కానీ అక్కడక్కడా ఒంటెలు, కనిపిస్తాయట. ఇసుక తుపాన్లు వచ్చే సమయంలో ఈ హైవే పై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. మాములు సమయంలో వాహనదారులు కేవలం రెండు గంటల్లోనే 256 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలరట.

సౌదీ అరేబియాకు పొరుగుదేశమైన యూఏఈ సరిహద్దు ప్రాంతానికి కి, సౌదీలోని హరాద్ కు మధ్య సాగే ఈ హైవే పై పూర్తిగా నిటారుగానే ఉంటుంది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపొడవైన మలుపుల్లేని హైవే గా ఆస్ట్రేలియా లోని ఐర హైవే ఉంది, దీని పొడవు 146 కిలోమీటర్లు. అయితే సౌదీ అరేబియా లోని హైవే 10 ఈ రికార్డును బద్దలుకొట్టి కొత్త రికార్డు సృష్టించింది. మొదట ఈ రోడ్దును సౌదీ రాజు అబ్దుల్లా కోసం ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది, అప్పట్లో ఆయన దీనిని ప్రైవేట్ రోడ్ గా వాడుకునేవారు, ప్రస్తుతం ఈ రోడ్డును చమురు రవాణా చెయ్యడానికి వినియోగిస్తున్నారు. 

Share your comments

Subscribe Magazine