ఇప్పుడు వాట్సాప్‌లో హోమ్ లోన్ తీసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి ఈ కొత్త సేవలను ప్రారంభించారు. పూర్తి వివరాలను చదవండి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాట్సాప్ ద్వారా నిమిషాల్లోనే హోమ్ లోన్ అందించే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మెరుగైన కస్టమర్ సేవలను అందించడానికి ఒక అడుగు ముందుకు వేసి వినియోగదారుల కోసం ప్రత్యేక సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇప్పుడు 'వాట్సాప్‌లో స్పాట్ ఆఫర్ ' ప్రారంభమైంది.ఈ సదుపాయం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి
ముందుగా, గృహ రుణం తీసుకోవాలనుకునేవారు HDFC యొక్క Whatsapp నంబర్ - +91 98670 00000 వాట్సప్ లో మెసేజ్ చేయాలి.తరువాత అడిగిన విధంగా ప్రాథమిక సమాచారాన్ని అందించడం చేయాలి.వినియోగదారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా, తాత్కాలిక హోమ్ లోన్ ఆఫర్ లెటర్ తక్షణమే రూపొందించబడుతుంది.
ఈ సందర్భంగా హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ మాట్లాడుతూ, భారతీయులకు సొంతిల్లు అనేది ఒక కల, దీనిని సాకారం చేయడానికి ఈ సేవలను ప్రారంభించాం. “వాట్సాప్‌తో అనుసంధానించబడిన ఈ వినూత్న ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా హెచ్‌డిఎఫ్‌సిలో మెరుగైన కస్టమర్ సేవలను మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి సారించి ఆ దిశగా పెట్టుబడి పెడుతున్నాము అని తెలిపారు.
ఎవరు అర్హులు?
ఈ సదుపాయం వినియోగించుకోవడానికి కేవలం ఏదైనా ఉద్యోగం చేస్తూ జీతం పొందుతున్న వారు మాత్రమే అర్హులు . కాబట్టి మీరు కూడా ఈ వర్గానికి చెంది గృహ రుణం కోసం చూస్తున్నట్లయితే, HDFC యొక్క ఈ ఫీచర్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని చదవండి.
Share your comments