Health & Lifestyle

ఖాళీ కడుపుతో టీ తాగడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

KJ Staff
KJ Staff
do you know that tea is dangerous when you have it on empty stomach
do you know that tea is dangerous when you have it on empty stomach

చాలా మందికి ఉదయాన్నే ముందుగా టీ తాగడం అలవాటు. వాస్తవానికి, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హాట్ పానీయం తాగకుండా తమ రోజును ప్రారంభించడాన్ని ప్రజలు ఊహించలేరు.

కానీ, ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా?

టీ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సౌకర్యవంతమైన పానీయం; ఇది రోగనిరోధక శక్తిని మరియు జీవక్రియను పెంచే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.

కానీ, ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల మీ పొట్ట పాడవ్వచ్చు లేదా కడుపులో ఆమ్లాలు పెరిగి మీ జీర్ణక్రియను నాశనం చేయవచ్చు, ఉదయపు టీ మీ నోటి నుండి మీ ప్రేగులకు బ్యాక్టీరియాను చేరవేస్తుంది, ఇది మీ జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది . అజీర్ణం మరియు గుండెల్లో మంట కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా తినేటప్పుడు టీ తాగడానికి బలమైన కారణాలు.

పడగడుపున టీ తాగడంవల్ల కలిగే దుష్ప్రభావాలను తెలుసుకోండి.

1. తలనొప్పులు: మీ తలనొప్పిని తగ్గించుకోవడానికి మీరు ఒక కప్పు తాగి ఉండవచ్చు, కానీ టీలో కెఫిన్ ఉండటం వల్ల ఇది మరింత తలనొప్పికి కారణం కావచ్చు. పడుకునే ముందు పుష్కలంగా నీరు త్రాగడం దీనికి ఒక పరిష్కారం.

2. అజీర్ణం మరియు డీహైడ్రేషన్: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్పడుతుంది. టీ ఒక మూత్రవిసర్జనకారి , ఇది మీరు తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది, తరచుగాశరీరానికి తగ్గ నీటిని భర్తీ చేయకపోతే, నిర్జలీకరణానికి కారణమవుతుంది.

“రాత్రి గంటల కొద్దీ నిద్రపోవడం వల్ల మీ శరీరం ఇప్పటికే డీహైడ్రేషన్‌కు గురైఉంటుంది , మీరు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే టీ తాగితే అది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. టీలో ఉండే థియోఫిలిన్ అనే రసాయన పదార్ధం, కోప్రోలైట్‌పై డీహైడ్రేటింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది మలబద్ధకానికి కూడా దారితీయవచ్చు" అని నిపుణుడు చెప్తున్నారు

3. పోషకాల శోషణను నిరోధిస్తుంది: టీలో టానిన్ అనే మూలకం ఉంటుంది, ఇది ఆహారం నుండి శరీరం తీసుకునే ఇనుము శోషణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది; కెఫీన్ పోషకాల శోషణను తగ్గిస్తుంది.


4. అసిడిటీ: టీ మీ పొట్టలోని ద్రవాల యొక్క యాసిడ్ బేస్ మరియు ఆల్కలీన్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది, ఇది ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌తో, మీరు మీ దిగువ ఛాతీలో నొప్పిని అనుభవించవచ్చు, దీనిని గుండెల్లో మంటగా సూచిస్తారు. గుండెల్లో మంట మీ కడుపులో ఆ ఆమ్ల టీ ప్రతిచర్యలో ఒక భాగం.


ఖాళీ కడుపుతో టీ తాగే బదులు, ఈ క్రింది వాటిని చేయండి:

నిపుణుల ప్రకారం, మీరు దీన్ని మీ అల్పాహారంతో పాటు లేదా కొన్ని స్నాక్స్‌తో పాటు తీసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు టీ తీసుకునే ముందు నట్స్ వంటివి తీసుకోవచ్చు. కెఫిన్ ఉందని హెర్బల్ టీ లను తాగండి

ఇది కూడా చదవండి.

నిద్రపోవడంలో సమస్య/ నిద్రలేమి తో బాధపడుతున్నారా? దీన్ని ఇంట్లో తయారుచేసి వాడండి!

టీ లోని చక్కెరను బెల్లంతో భర్తీ చేయవచ్చు, ఇది ఆరోగ్యకరమైనది మరియు భాస్వరం, ఇనుము, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి అనేక విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. బెల్లం కూడా జీర్ణక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. టీ తాగడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 3 గంటల సమయం, లేదా ఏదయినా తిన్న తర్వాత తీస్కోడం అని నిపుణులు సూచిస్తున్నారు

ఇది కూడా చదవండి.

నిద్రపోవడంలో సమస్య/ నిద్రలేమి తో బాధపడుతున్నారా? దీన్ని ఇంట్లో తయారుచేసి వాడండి!

Share your comments

Subscribe Magazine