Health & Lifestyle

ఉదయాన్నే బెల్లం తింటున్నారా.. అయితే ఈ ప్రయోజనాలు మీ సొంతం?

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భాగంగా ప్రతి ఒక్కరూ సరైన ఆహార నియమాలు పాటించడం లేదు. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రతి ఒక్కరు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ జబ్బుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఈ విధమైనటువంటి చిట్కాలలో భాగమే బెల్లం. ప్రతిరోజు ఉదయం మనం తీసుకునే ఆహార పదార్థాలలో చక్కెర బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి ప్రతిరోజూ బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం...

బెల్లం తినడానికి తీపి రుచిని కలిగి ఉండటమే కాకుండా ఎన్నో రకాల పోషక విలువలు, విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం మన ఆహారంలో భాగంగా బెల్లం ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఎర్రరక్తకణాలు అభివృద్ధికి తోడ్పడతాయి. నిత్యం బెల్లం ఉపయోగించడం వల్ల కడుపులో మంట, నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు.

బెల్లంలో ఎక్కువగా క్యాల్షియం ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఇవి ఎముకలు, దంతాలను దృడంగా మార్చడానికి దోహద పడతాయి. మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం అల్లం, బెల్లం కలిపి తినడం ద్వారా మోకాళ్ళ నొప్పి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.ఇక చక్కెరకు బదులుగా బెల్లము ఉపయోగించడం వల్ల మన శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచి మధుమేహ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది. కనుక ప్రతి రోజు బెల్లం తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine