Health & Lifestyle

ముల్లంగి తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి.......

KJ Staff
KJ Staff

మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు అనేక రకాల కూరగాయలను చూస్తాం. వాటిలో కొన్ని కూరగాయలను ఎవరు కొనడానికి ఇష్టపడరు. అటువంటి రకాల్లో ముల్లంగి ఒకటి. ముల్లంగిలో ఉండే ఘాటు మరియు విభిన్నమైన రుచి, చాల మందికి నచ్చదు. ఆరోగ్యకరమైనవన్నీ రుచిలేకుండా ఉంటాయి అనడానికి ముల్లంగి ఒక ఉదాహరణ. ముల్లంగి లో దొరికే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు మరేతర కూరగాయలకి తక్కువ కాదు. తినగా తినగా వేప తియ్యగాయినట్లు, ముల్లంగి కూడా మొదట ఘాటుగా అనిపించినా కాలక్రమేణా నోటికి రుచిగా అనిపిస్తుంది.

ముల్లంగిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అంతే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ముల్లంగి దోహదపడుతుంది. ముల్లంగి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ వ్యాధిని నియంత్రించడం:

ప్రస్తుత కాలంలో వయసుతో సంభంధం లేకుండా ప్రతీ ఒక్కరిని వేధిస్తున్న సమస్య షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధి జన్యుపరంగా కానీ, ఆహారంలో లోపలా వల్ల కానీ, అధిక స్ట్రెస్ వల్ల కూడా షుగర్ వ్యవధి రావచ్చని వైద్యులు చేబుతున్నారు. ముల్లంగిలో ఉండే సహజసిద్ధమైన గ్లూకోసినోలేట్స్, ఐసోథియోసైనేట్, వంటి రసాయన సమ్మేళనాలు,రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి.

క్యాన్సర్ వ్యాధిపై పోరాటం:

ముల్లంగి తో పాటు, ముల్లంగి ఆకులలో కూడా అనేక పోషకవిలువలున్నాయి. వాటిలో ముఖ్యంగా కాన్సర్ సెల్స్ పెరగకుండా నిలిపేందుకు అవసరమయ్యే యాంటీఆక్సిడాంట్స్ ముల్లంగి ఆకులలో లభిస్తాయి. ముల్లంగి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా లివర్, ప్రోస్టేట్, బ్రెస్ట్,ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్ అరికట్టవచ్చని కొన్ని అధ్యయాలు చెప్తున్నాయి. ముల్లంగి ఆకులు బ్రెస్ట్ కాన్సర్సెల్స్ నిలిపివేస్తుందని ఒక అధ్యాయంలో పేర్కొన్నారు అయితే దీని మీద క్షేత్ర స్థాయి పరీక్ష అవసరం.

లివర్ పనితీరును పెంచుతుంది:

ముల్లంగి లివర్ పని తీరు పెంచడంలో సహాయపడుతుంది. లివర్ మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లను శరీరానికి ఉపయోగపడే విధంగా మారుస్తుంది. అంతేకాకుండా మనం రోజువారీ తీసుకునే టాబ్లెట్స్ మిగతా శారీర భాగాలకు సరఫరా చేస్తుంది. ముల్లంగిలో ఉండే ఇండోల్-3-కార్బినోల్, మిథైల్థియో-3-బ్యూటినైల్ ఐసోథియోసైనేట్ వంటివి హానికరమైన టాక్సిన్స్ మన శరీరం నుండి బయటకు పంపిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

ముల్లంగి మీ గుండె యొక్క పనితీరు మెరుగుపరుస్తుంది. ముల్లంగిలో ఉండే విటమిన్-సి, కాల్షియమ్, పొటాషియం, బ్లడ్ ప్రెషర్ ని నియంత్రిస్తుంది. రక్త పోటు నియంత్రణలో ఉన్నపుడు గుండెదుకు సంభందించిన వ్యాధులు రావడం, తగ్గిపోతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ సాగవుగా సాగేందుకు రక్తనాళాలను మెరుగుపరచడంలో ముల్లంగి కీలక పాత్ర పోషితుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

ముల్లంగి మీ గుండె యొక్క పనితీరు మెరుగుపరుస్తుంది. ముల్లంగిలో ఉండే విటమిన్-సి, కాల్షియమ్, పొటాషియం, బ్లడ్ ప్రెషర్ ని నియంత్రిస్తుంది. రక్త పోటు నియంత్రణలో ఉన్నపుడు గుండెదుకు సంభందించిన వ్యాధులు రావడం, తగ్గిపోతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ సాగవుగా సాగేందుకు రక్తనాళాలను మెరుగుపరచడంలో ముల్లంగి కీలక పాత్ర పోషితుంది.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:

విపరీతంగా పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కారణంగా, జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయి. ముల్లంగి దుంపలోను, ఆకుల్లోను అధిక పీచు పదార్ధాలు ఉంటాయి. పీచు పదార్ధాలు, మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడంలో మనకు తోడ్పడుతుంది. మలబద్దకాన్ని తగ్గించడం కోసం వైద్యులు ముళ్ళగిని తినమని సూచిస్తున్నారు. కొన్ని అధ్యనాల ప్రకారం ముల్లంగి కడుపులో వచ్చే పుల్లను నివారిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న ముల్లంగిలోకూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. ముల్లంగి ఆకులు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుందని తెలుసుకున్నాం అయితే ముల్లంగి ఆకులను ఆ=అధిక మొత్తంలో తినడం ద్వారా లో-బీపీ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ముల్లంగిలో ఉండే ఒక ప్రత్యేక లక్షణం ద్వారా శరీరంలోని నీటిని మూత్రం రూపంలో కోల్పోయి, శరీరం డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. USDA సూచించిన విధంగా రోజుకు ఒక అరకప్పు ముల్లంగిని తీసుకోవడం ద్వారా ఎటువంటి ప్రమాదం ఉండదు.

Share your comments

Subscribe Magazine