Health & Lifestyle

మీ జీవితకాలాన్ని పెంచే అద్భుత ‘టీ’లు ఇవే..!

KJ Staff
KJ Staff
Health Benefits
Health Benefits

ప్రతీ భారతీయ ఇంటిలో ఉదయం లేవగానే మొదట చేసే పనుల్లో ఒకటి టీ తాగడం. అధిక శాతం మంది ఇండ్లలో ఇలా టీ తాగడం ఒక ఆచారంలా మారిపోయింది.  టీ రుచిగా ఉండటంతో పాటు దీనిని నిత్యం తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది ఇష్టంగా టీ తాగుతారు. టీ తాగడం వల్ల అనేక వ్యాధులు దరిచేరకుండా ఉంటాయనీ, మానసిక స్థితి సైతం మెరుగు పడుతుందనీ, జీవిత కాలన్ని పెంచడంలోనూ కీలకంగా ఉంటుందని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే టీ లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాఫీ కంటే తక్కువ కెఫిన్ ను కలిగి ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉండే వారికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే, పలు రకాల టీలు మన ఆరోగ్యంతో పాటు ఆయుశును సైతం పెంచుతాయి. అలాంటి పలు రకాల టీలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రీన్ టీ: సాంప్రదాయ చాయ్ కి ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ టీ. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువే.  గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర వేడి.. మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

చమోమిలే టీ: చమోమిలే టీ యాంటీఆక్సిడెంట్లుతో పాటు యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండిన శక్తివంతమైన పానీయం. ఇది మెరుగైన నిద్రను అందిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. బ్లడ్ ప్రెషర్ ను అదుపులో ఉంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. చమోమిలే టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లతో పోరాడతాయి. క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు జీవిత కాలాన్ని పెంచడంలో పాత్ర పోషిస్తుంది.

అల్లం టీ: వ్యాధులపై పోరాడటానికి, అనేక రోగాలకు చికిత్స చేయడానికి అల్లం ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. చలన అనారోగ్యాన్ని శాంతపరచడానికి ఈ టీ ఒక ప్రభావవంతమైన మార్గం. అల్లం టీలో జింజెరోల్స్ అనే సమ్మేళనం ఉంటుంది.దీనిని క్యాన్సర్ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల నుండి రక్షించే చికిత్సలలో ఉపయోగిస్తారు.  కాబట్టి అల్లం టీ తాగడం వల్ల అలాంటి సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఉన్న వాటి ప్రభావాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

Related Topics

Health Benefits

Share your comments

Subscribe Magazine