Health & Lifestyle

రోజూ కీరదోస తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

KJ Staff
KJ Staff
keera dosakaya
keera dosakaya

మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలోరూ శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగయాలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పోష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

కీరదోసను చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ అందులో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు ఉన్నాయి. షుగర్‌ను అదుపు చేసే పదార్ధాలు ఉన్నాయి. ఇండియాలో షూగర్ వ్యాధితో ఎక్కువమంది బాధపడుతన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. షూగర్ ఒక్కసారి వస్తే కంట్రోల్ లోకి తెచ్చుకోవడం చాలా కష్టతరమవుతుంది. ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. జీవనశైలి పూర్తిగా మారుతుంది.

కీరదోసతో డయాబెటీస్ కంట్రోల్ ఎలా?

-కీరదోస శరీరంలోని ఇన్సులిన్‌ నిరోధకతను ప్రేరేపిస్తాయి. హైపర్ గ్రైసీమియా, మంటను నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి.

-కీరదోస తినడం వల్ల రక్తంలోని షూగర్ లెవల్ కంట్రోల్‌లోకి వస్తుంది. కీరదోసను రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల బరువు తగ్గిపోతారు.

-కీరదోసల్లోని యాంటీ హైపర్ గ్ల్రెసిమిక్ ప్రభావం వల్ల గ్లూకోజ్ స్ధాయి తగ్గుతుంది. దీని వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది.

-ఇక కీరదోస తోక్కలు కూడా షూగర్ ను కంట్రోల్‌లోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. కీరదోస తొక్కల్లో ఆస్కార్బిక్ ఆమ్లం, పాలీఫెరాల్స్, ఫ్లవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి షూగర్‌ను అదుపులోకి తీసుకురావడంలో బాగా ఉపయోగపడతాయి.

-ఇక కీరదోసను జ్యూస్‌లాగా చేసుకుని తినడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే ఎసిడిటి సమస్య తగ్గిపోతుంది. ఇక వేడిని తగ్గిస్తుంది.

-అలాగే మూత్ర విజర్ఝన సరిగ్గా జరగడానికి, కిడ్నీలలో రాళ్లు కరిగిపోవడానికి కీరదోసలు బాగా ఉపయోగపడతాయి. ఇక వాపు, నొప్పిని తగ్గించడానికి కూడా కీరదోస ఉపయోగపడుతుంది.

-ఇక కీరదోసలను ముక్కలుగా చేసి కళ్లపై కొద్దిసేపు ఉంచితే మంటలు తగ్గి కళ్లు చల్లగా ఉంటాయి. కళ్ల వాపు తగ్గుతుంది.

-అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడానికి కీరదోస బాగా ఉపయోగపడుతుంది. ఇక కీరదోసల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. కీరదోసల్లోని పోటాషియం, మెగ్నీషియం, సోడియం షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది

-ఇక జట్టు పెరగడానికి, కడుపులో లద్దె పరుగులను నిర్మూలించడం, చిగుళ్ల సమస్యలు, మూత్ర సంబంధ సమస్యలు నివారించడానికి కీరదోస ఉపయోగపడుతుంది.

 

Share your comments

Subscribe Magazine