శాస్త్రీయంగా సముద్ర చేపలను ఆహారంగా తీసుకోవడం వలన దీర్ఘకాలిక రోగాలు మన దరిచేరవని రుజువైంది. ఈ సముద్ర చేపలను తినడం వలన గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుందని తేలింది. ఇది ఇలా ఉండగా ఈ చేపలను తినడం వాల్ల కిడ్నీ సమస్యలు కూడా తగ్గుతాయి. తాజా అధ్యయనంలో కిడ్నీ సమస్యలు ఉన్నవారు సముద్ర చేపలను తింటే 8 నుండి 10 శాతం రిస్క్ తగ్గుతుందని వెల్లడించారు. ఈ విషయాన్నీ ఆస్ట్రేలియాలోని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది.
ప్రపంచ జనాభాలో 10 శాతం ప్రజలు ఎక్కువ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మూత్రపిండాల సమస్యలు మనుషుల మరణానికి కూడా కారణం అవుతున్నాయి. ఎటువంటి వివిధ కిడ్నీ సమస్యల నుండి బయట పడటానికి సముద్ర చేపలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. సముద్ర చేపలలో అధికంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మూత్రపిండాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తున్నాయి అని తాజా అధ్యయనం వెల్లడించింది. సముద్ర చెప్పాలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మొక్కల నుండి వచ్చే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుందని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది.
జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ వివిధ రకాలా సముద్ర చేపలైన పొలస, మాగ, మరియు సముద్రపు మంచి పీతలు తిన్న వారిపై పరిశోధనలు చేసింది. సముద్ర చేపల్లో ఎక్కవగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉన్నందున, వీటిని తినడంతో మూత్రనాళాలు శుభ్ర పరచడమే కాకుండా, వాటిలో ఉన్న రాళ్లను, కొవ్వు పదార్ధాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి అన్నారు. 12 దేశాలకు చెందిన 25 వేల మందికి పైగా కిడ్నీ రోగాల బాధితులపై జరిపిన 19 రకాల అధ్యయనాల ఫలితాలను వర్సిటీ వెల్లడించింది. ఏ చేపలు కచ్చితంగా ఈ మూత్రపిండాల వ్యాధుల రిస్క్ ను తగ్గిస్తున్నాయో చెప్పలేకపోయినప్పటికీ, వాటిలో ఉన్న ఫ్యాటీ యాసిడ్ రక్త స్థాయిని పెంచడంలో ప్రభావం చూపిస్తుందని గుర్తించారు.
ఇది కూడా చదవండి..
మలబద్ధకం పోవాలంటే ఇలాంటి ఆహారం తినండి..
ఈ యూనివర్సిటీ తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 49 నుండి 77 ఏళ్ల వయసు వారిపై ఈ పరిశోధనలు చేసారు. వీరు పరిగణలోకి ధూమపానం, మధ్యపానం అలవాటు ఉన్న వారితో పాటు గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిని కూడా తీసుకున్నారు. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న చేపలను తినడం వల్ల 8 నుండి 10 శాతం వరకు మూత్రపిండాల వ్యాధీ తీవ్రతను తగ్గించిందని గుర్తించారు. ఈ సముద్ర చేపలను వారానికి రెండు సార్లు తినడం వాల్ల రోజుకు 250 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమకూరుతున్నట్లు తేల్చారు. కిడ్నీ సమస్యలు రాకుండా లేదా ఒకవేళ కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే రిస్క్ శాతంను తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలినట్టు శాస్త్రవేత్త డాక్టర్ మట్టిమర్క్ తెలిపారు. సముద్ర చేపలు తినడం వాళ్ళ అవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి..
Share your comments