Health & Lifestyle

మలబద్ధకం పోవాలంటే ఇలాంటి ఆహారం తినండి..

KJ Staff
KJ Staff

మలబద్ధకం వలన చాలా మంది ఎవరికీ చెప్పుకోలేని విధంగా బాధను అనుభవిస్తూ ఉంటారు. మలబద్ధకం వల్ల కడుపులో చాలా అసౌకర్యంగా ఉండి చికాకు పెడుతుంది. మలబద్ధకం ద్వారా రక్తస్రావం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎక్కువగా జంక్ ఫుడ్, ఫైబర్ తక్కువ ఉన్న ఆహరం తీసుకోవడం, వేయించిన ఆహరం, ప్రాసెస్డ్ ఫుడ్, జీవన శైలిలో మార్పులు, చేదు ఆహార అలవాట్లు, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, స్మోకింగ్ వంటి అలవాట్ల వల్ల మలబద్ధకం సమస్య వచ్చే వీలు ఉంది. సరైన సమయానికి చికిత్స తీసుకోకపోయితే కాన్సర్, పైల్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి వివిధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య నుండి బయటపడటానికి వ్యాయామం, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం మొదలగు పనులు చేయాలి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి మీ యొక్క డైట్లో ఎలాంటి ఆహరం తీసుకోవాలో తెలుసుకోండి.

బొప్పాయి..
బొప్పాయిని మన డైట్లో తోసుకుంటే కనుక మనకు వివిధ రకాల జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గుతాయి. బొప్పాయి పండు మన జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బొప్పాయి ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. బొప్పాయిలో ఎక్కువ ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వాల్ల కాన్స్టిపేషన్ సమస్య నుండి బయటపడవచ్చు. బొప్పాయి మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీనిలో ప్రోటీన్స్, ఫైబర్, పొటాషియం, కెరోటిన్, ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లు, ఫ్లేవినాయిడ్స్, పంటొనిక్ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

ఓట్ మీల్
ఓట్స్ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో సహాయపడతాయి. ఓట్స్ను మన అల్పాహారంలో చేర్చుకుంటే, మన ఆరోగ్యం చాల మెరుగుపడుతుంది. ఓట్స్ లో ఎక్కువగా ఇరాన్, మాంగనీస్, ప్రోటీన్స్, రాగి, ఫైబర్, గ్లూకోస్ వంటి అనేక ఉపయోగకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఓట్స్లో బీటా- గ్లూకాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కరిగే ఫైబర్, ఇది కడుపు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఓట్స్ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో కూడా సహాయపడతాయి. ఓట్స్ ప్రేగుల పనితీరును ప్రోత్సహిస్తుంది.

ఇది కూడా చదవండి..

రోజువారీ ఆహారంలో అరికెలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ..

అవిసె గింజలు
ఇవి గట్ హెల్త్ కు చాల మంచివి. దీనిలో లాస్కీన్ ప్రక్షాళన గుణాలు ఉంటాయి. అవిసె గింజలు తినడం వలన మలం సులువుగా వెళ్తుంది. ఇవి త్వరగా జీర్ణం కావు కాబట్టి ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు.

ప్రోబయోటిక్స్
ప్రోబయోటిక్స్ గట్ మైక్రోబయోమ్ను పెంచడంలో సహాయపడతాయి. ప్రోబయోటిక్స్ జీవక్రియ సూక్ష్మజీవులు, ఇవి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ప్రోబయోటిక్స్ జీవక్రియను మెరుగుపరుస్తాయి.పెరుగు, యాపిల్‌ సైడర్‌ వెనిగర్, యోగర్ట్, ఇడ్లీపిండి, దోసెపిండి, మజ్జిగలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో లాక్టోబాసిల్లస్, బైఫిడో బాక్టీరియం రకాలు ఎక్కువ ప్రయోజకరం.

ఇది కూడా చదవండి..

రోజువారీ ఆహారంలో అరికెలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ..

Related Topics

diet plan

Share your comments

Subscribe Magazine