Health & Lifestyle

చెడు కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు ఈ డ్రై ఫ్రూప్ట్స్ వాడి చుడండి.....

KJ Staff
KJ Staff

మారుతున్న జీవన ప్రమాణాలు వల్ల మనిషి ఆహారం మీద సరైన శ్రద్ధ చూపడంలేదు. ఫాస్ట్ ఫుడ్స్ మరియు సవీధుల్లోని ఆహారానికి అలవాటుపడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. బయట దొరికే దాదాపు అన్ని వంటకాలు తయారీలో పామ్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. పామ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుందని ఎఫ్సిఐ హెచ్చరిస్తుంది. ఇటువంటి ఆహారం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణం అవుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నిర్ణిత స్థాయి కంటే అత్యధికంగా ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోయి, రక్తపోటు మరికొన్ని సార్లు హార్ట్ అటాక్స్ కి కారణం అవుతుంది. అయితే కొన్ని డ్రై ఫ్రూప్ట్స్ తినడం ద్వారా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రించవచ్చని కొందరు వైద్యులు సూచిస్తున్నారు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం: డ్రైఫ్రూప్ట్స్ అన్నిటిలోకెల్లా బాదంకు ప్రత్యేక స్థానం ఉంది. బాదం మంచి ఆరోగ్యానికి కీలకంగా పరిగణించబడుతుంది. అయితే బాదంను పచ్చివి కంటే నీటిలో నానబెట్టి తీసుకోవడం మంచిది. బాదంలో ఉండే అమైనో ఆసిడ్స్ శరీరంలో నైట్రిక్ ఆసిడ్స్ ఉత్పత్తి చెయ్యడనికి సహాయపడతాయి. బాదం రక్తంలో చేదు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడుతుంది.

పిస్తా: డ్రై ఫ్రూప్ట్స్ గా తినడంతో పాటు పిస్తాను, అనేక రకాల స్వీట్ల తయారీలోనూ వినియోగిస్తారు. ప్రతీ రోజు పిస్తాను తినడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా పిస్తా తిందాం ద్వారా ఊబకాయం సమస్య నుండి కూడా తప్పించుకోవచ్చు.

వేరుసెనగలు: మిగిలిన డ్రై ఫ్రూప్ట్స్ తో పోలిస్తే వేరుశెనగలు తక్కువ ధరకే లభ్యం అవుతాయి, అందుకే వేరుశెనగలను 'పూర్ మాన్ ఆల్మండ్' అంటే పేదవారి బాదం గా కూడా పరిగణిస్తారు. వేరుశెనగలను, ఉడకబెట్టుకొని లేదా రోస్ట్ చేసుకుని తినొచ్చు. వీటిని రోజు తిందాం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

వాల్నట్స్: వాల్నట్స్ అనేక పోషక విలువలతో నిండి ఉంటాయి. వాల్నుట్స్ మెదడు ఆకారాన్ని కలిగి ఉంటాయి, వీటిని తినడం ద్వారా మెదడుకు ఉపయోగపడే ప్రోటీన్లు లభిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్, మోనోసాకరైడ్స్ పుష్కలంగా లభిస్తాయి, ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును నివారిస్తాయి,మనల్ని వ్యాధుల నుండి కాపాడతాయి.

Share your comments

Subscribe Magazine