Health & Lifestyle

వేసవిలో అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ చర్యలు పాటించండి

KJ Staff
KJ Staff

వేసవి కాలం ఆరంభమైన ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచికొట్టాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు తక్కువ ఉండట్లేదు. అధిక ఉష్ణోగ్రతలు ఒకవైపైతే వేడి గాలులు మరోక్కవైపు చేరి బెంబేలెక్కిస్తున్నాయి. ఎండా ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున ఆరోగ్యసమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎండాకాలంలో ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

ఎండాకాలంలో చమట ఎక్కువుగా పట్టడం ద్వారా శరీరం ఎక్కువుగా నీటిని కోల్పోయి డిహైడ్రాట్ అవుతుంది. మధుమేహం ఉన్నవారు డిహైడ్రాషన్ భారిన పడకుండా తగిన జాగ్రతలు పాటించాలి. కోల్పోయిన నీటిని తిరిగి అందించాడని తరచూ నీటిని తాగుతూ ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు నీటిని కోల్పోవడం వలన కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడం, నీరసంగా ఉండటం వంటివి గమనించినప్పుడు, ఒక గ్లాస్ నీటిలో చాల కొద్దీ మొత్తంలో చెక్కర కలుపుకుని తాగితే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరిగి తిరిగి శక్తీ పుంజుకునేఅవకాశం ఉంటుంది.

ఎండ ఎక్కువుగా ఉండే సమయాల్లో బయట తిరగకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలు దాటినా తర్వాత బయటకు వీలైనంత తక్కువుగా వెళ్లడం మంచిది. పగటిపూట ఎండ లేని సమయంలో మాత్రమే బయటకు వెళ్లి పనులు పూర్తిచేసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరిగితే శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ భారిన పడే అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine