Health & Lifestyle

రోజువారీ ఆహారంలో అరికెలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ..

Srikanth B
Srikanth B
Benefits of taking  arikelu in daily diet
Benefits of taking arikelu in daily diet

2023 సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి మిల్లెట్ ఇయర్ గ ప్రకటించిన విషయం తెలిసిందే , ఈ చిరు ధాన్యాలలో భాగమైన అరిసెలు రోజువారీ ఆహారం లో తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మనం ఈరోజు తెలుసుకుందాం !

 

ర‌క్త హీన‌త‌ను నివారించ‌డంలోనూ అరికెలు స‌హాయప‌డ‌తాయి.అరికెల‌ను క్రమం తప్పకుండ తీసుకుంటే ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య తో పటు శరీరంలో అనవసరముగా పేరుకు పోయిన కొవ్వును తగ్గించడం లో దోహదం చేస్తుంది .


నిద్ర లేమి సమస్యలతో బాధపడేవారికి అరికెల ఉత్తమం గ పని చేస్తాయి . .అరికెల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే.మంది నిద్ర ప‌డుతుంది.అంతే కాదు, అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఎముకలు, కండరాలు, నరాలు బలంగా మార‌తాయి.నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్య‌లు దూరం అమ‌వుతాయి.శ‌రీరానికి బోలెడెంత శ‌క్తి ల‌భిస్తుంది.

వివిధ రాష్ట్రాలలో ఇలా పిలుస్తారు :
కోడో మిల్లెట్ యొక్క వృక్షశాస్త్ర నామం Paspalum Scrobiculatom, హిందీలో కోడాన్, తమిళంలో వరగు, తెలుగులో అరికెలు, మలయాళంలో వరక్, కన్నడలో అరక, మరాఠీ, గుజరాతీ మరియు పంజాబీలో కోద్రా.

రాగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

అరికెలు లో ఉండే పోషకాలు :
100 గ్రాముల ఎండు అరికెలు లో దాదాపు 353 కేలరీలు ఉంటాయని చెబుతున్నారు. ఇది పోషకమైన ధాన్యం మరియు 8.3 గ్రాముల ప్రోటీన్ , 65 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.4 గ్రాముల కొవ్వు, 5.2 గ్రాముల ఫైబర్, 35 mg కాల్షియం, 188 mg ఫాస్పరస్, 1.7 mg ఇనుము, .15 mg థయామిన్ మరియు 2 mg నియాసిన్.అరికెలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

1. అధిక ప్రోటీన్ కంటెంట్:
ప్రోటీన్ కోసం ప్రోటీన్ పొడి బదులు , మన ప్రోటీన్ అవసరాలను సహజంగా పొందడం ఉత్తమం. మీరు శాఖాహారులైతే, 100 గ్రాముల అరికెలలో లో 8.3 గ్రాముల ప్రొటీన్‌లు ఉన్నందున, అరికెల ద్వారా ప్రోటీన్ సహజంగా పొందవచ్చు .

2. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది:
అరికెలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచదు, డయాబెటిక్ రోగులకు ఇది చాలా మంచి ఆహారం.

3. బరువు తగ్గడానికి :
అరికెలలో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మనల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది దీనితో ఆకలి అధికముగా ఉండక పోవడం వాళ్ళ బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ ఆహారంలో అరికెల చేర్చుకోండి .

నిండుగా ఉంచుతుంది మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇది బరువు తగ్గడానికి అనువైన ఆహారంగా మారుతుంది.

4. గ్లూటెన్ ఫ్రీ:

అరికెల లో షుగర్ వ్యాధిని కల్గించే గ్లూటెన్ లేకపోవడం వాళ్ళ ఏది సగర వ్యాధి గ్రస్తులకు ఉత్తమముగా పని చేస్తుంది .

5. గాయం తొందరగా మానడానికి :
అరికెలను నూరి ముద్దా చేసి రాయడం ద్వారా గాయం త్వరగా మానడానికి సహాయపడుతుంది .

రాగుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

Share your comments

Subscribe Magazine