Health & Lifestyle

కలబందతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండిలా..!

KJ Staff
KJ Staff

కలబందకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడానికి కలబందను ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. కలబందలో ఎన్నో పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ క్రమంలోనే కలబందను తరచూ ఉపయోగించడం వల్ల మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. కలబంద జెల్ ను తాగడం వల్ల ఆరోగ్యాన్ని కూడా పొందించుకోవచ్చు నిపుణులు చెబుతున్నారు. మరి కలబంద వల్ల చర్మ సౌందర్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం...

ప్రస్తుత కాలంలో చాలామంది తమ సెల్ ఫోన్లలో నిమగ్నమై, నిద్రను దూరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్ళకింద నల్లటి మచ్చలు, వలయాలు ఏర్పడుతున్నాయి. నల్లటి మచ్చలు వలయాలను తొలగించుకోవడానికి కలబంద ఎంతో దోహదపడుతుంది రాత్రి పడుకునే సమయంలో కలబంద జెల్ ను కంటికింద నల్లటి వలయాల పై పెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేయాలి.ఇలా చేయడం వల్ల కళ్ళ కింద ఏర్పడిన నల్లటి మచ్చలు వలయాలను తగ్గించుకోవచ్చు.

కలబంద జెల్ ను రాత్రి పడుకునే ముందు మొహం మొత్తం రాసుకొని మరుసటి రోజు చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల మొహం పై ఏర్పడిన దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించి మొహం ఎంత కాంతివంతంగా మెరవడానికి దోహదపడుతుంది. చాలామందిలో మొహం పై మడతలు ఏర్పడి వృద్ధాప్య ఛాయలు కనబడుతుంటాయి. ఈ విధంగా వృద్ధాప్య ఛాయలతో బాధపడేవారు కలబంద గుజ్జులోకి కొద్దిగా పాలు తేనె లేదా రోజ్ వాటర్ కలిపి ముఖం, మెడ మొత్తం ప్యాక్ లా వేసుకొని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల ముఖం పై ఏర్పడిన ముడతలు తొలగిపోతాయి. ఇలా కలబంద ఉపయోగించి మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine