Health & Lifestyle

ఉసిరిని ఇలా రోజూ తినండి.

KJ Staff
KJ Staff
Amla to Increase Immunity
Amla to Increase Immunity

నారింజ, ఉసిరి, నిమ్మ లాంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఇమ్యునిటీని పెంచుతాయి.

మనల్ని కరోనా బారి నుంచి రక్షించేలా మన రోగ నిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తాయి. ముఖ్యంగా ఉసిరి కాయ ఒక్కటి తిన్నా చాలు.. మనకు రోజులో అవసరమైన విటమిన్ సి లో చాలా వరకు అందుతుంది. ఉసిరి కాయ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే..

రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి. కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్న ఈ సమయంలో రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించుకునేందుకు వీటిని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి లేకపోతే కరోనా ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కరోనా ప్రభావం పెద్దగా ఉండదు.

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ..

ఉసిరి కాయలో చాలా రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికిల్స్ ని బయటకు తొలగిస్తాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి. ఉసిరి కాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. ఇది మొటిమలు, మచ్చలు, చుండ్రును కూడా తగ్గిస్తుంది.

జలుబు, దగ్గు తగ్గిస్తుంది.

కరోనా ప్రభావం శ్వాసకోశ వ్యవస్థ పై ఎక్కువగా పడుతుంది. అందుకే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉసిరి కాయను రోజూ తినడం వల్ల జలుబు, దగ్గు వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

క్రోమియం కూడా ఎక్కువ..

ఉసిరికాయలో క్రోమియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. గుండె, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన భాగాలు కరోనా బారిన పడి ఇబ్బందులు పడతాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం.

ఉసిరి కాయను రోజూ ఎలా తీసుకోవాలంటే..

సాధారణంగా ఉసిరి కేవలం ఒక సీజన్ లో మాత్రమే లభిస్తుంది. కానీ దాన్ని రోజూ తీసుకోవాలంటే దాన్ని భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏ రూపంలో తీసుకోవచ్చంటే..

1. ఉసిరి కాయ జ్యూస్

రోజూ ఉదయాన్నే ఉసిరి కాయ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం డీటాక్సిఫై అవుతుంది. ఒకవేళ మీరు తీసుకునే జ్యూస్ బాగా చిక్కగా ఉంటే చిన్న షాట్ గ్లాస్ తీసుకోవాలి. అదే పల్చగా ఉంటే పెద్ద గ్లాసు నిండా తీసుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే అందులో తేనె కలిపి తీసుకోవచ్చు. మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉసిరి రసాన్ని అమ్ముతున్నాయి. ఒకవేళ మీరే చేసుకుంటే ఫ్రిజ్ లో పెట్టుకొని కొన్ని రోజుల వరకు వాడుకోవచ్చు.

2. ఉసిరి క్యాండీ

ప్రస్తుతం మార్కెట్లో ఉసిరి క్యాండీలు ఎక్కువగానే లభిస్తున్నాయి. ఇవి తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఉంటాయి. ఈ తీపిదనం అందులో చక్కెర లేదా బెల్లం వేసినందువల్ల వస్తుంది. బెల్లం వేసినవి తీసుకుంటే మరీ మంచిది. ఉసిరి క్యాండీలో మరింత రుచి కావాలంటే ఉప్పు, మిరియాల పొడి లాంటివి వేసినవి కూడా ఎంచుకోవచ్చు.

3. ఉసిరి పచ్చడి

సాధారణంగా ఊరగాయ పెడితే ఏ కాయలోనైనా పోషకాలు తగ్గిపోతాయి. కానీ ఉసిరి కాయలో మాత్రం ఏం చేసినా పోషకాలన్నీ అందుతాయి. కానీ ఇందులో ఎక్కువ మొత్తంలో ఉప్పు, నూనెలు ఉంటాయి కాబట్టి రోజుకి కేవలం ఒకటి లేదా రెండు టీస్పూన్ల ఊరగాయ మాత్రమే తినాలి. ఉసిరి పచ్చడిలో ఎక్కువ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఇవి నిల్వ చేసుకోవచ్చు.

4. ఉసిరి చట్నీ

ఉసిరి కాయ రోటి పచ్చడి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని కూడా పెద్ద మొత్తంలో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఇది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది.

5. ఉసిరి కాయ, ఉప్పు

చాలామందికి ఇష్టమైన కాంబినేషన్ ఇది. ఉసిరికాయను కట్ చేసుకొని అందులో ఉప్పు నంజుకొని తినడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇలా తినడం వల్ల చేదు రుచి కూడా ఉండదు. కావాలంటే చిటికెడు ఛాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది రుచిని మరింత పెంచుతుంది.

ఇలా రకరకాలుగా ఉసిరి కాయను మీ రోజువారీ డైట్ లో చేర్చుకోవచ్చు. ఎలా తిన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఉసిరి కాయ కరోనాను ఎదురించే శక్తిని అందించే సూపర్ ఫుడ్ అందుకే దీన్ని వీలైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిది. అయితే డయాబెటిస్, బీపీ వంటి సమస్యలున్న వారు మాత్రం ఉసిరి ముక్కలు, రసం వంటివి తీసుకోవాలి. ఊరగాయ, క్యాండీ వంటివి షుగర్ లెవల్ ని, బీపీని పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని కాపాడేందుకు బరువు తగ్గించేందుకు కూడా ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది.

https://krishijagran.com/featured/amla-farming-by-a-60-year-old-farmer-through-rural-entrepreneurship-in-rajasthan/

https://krishijagran.com/health-lifestyle/this-super-berry-can-save-you-from-winter-problems/

Share your comments

Subscribe Magazine