వాట్సాప్ గత కొన్ని నెలలుగా వినియోగదారుల కోసం బీటాలో ఒకేసారి నాలుగు డివైస్ ల లో login చేసుకునే విధం అప్డేట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. WhatsApp ఇప్పుడు కొత్త ఫీచర్ ను తీసురానున్నది మీరు లాగిన్ అయిన ప్రతిసారీ మీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి నాలుగు వేర్వేరు పరికరాలలో WhatsAppని ఉపయోగించుకోవచ్చు .
కంపెనీ ప్రకారం,, వెబ్ బ్రౌజర్ ద్వారా నేరుగాఈ ఫీచర్‌ను ఉపయోగించే వినియోగదారుల సంఖ్య పెరిగింది. వారి ల్యాప్‌టాప్‌లలో పని చేసే సందర్భాలలో మరియు కమ్యూనికేషన్ కోసం WhatsApp ను ఉపయోగించే కస్టమర్లకు ఈ ఫంక్షనాలిటీ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది మీ ఫోన్‌ను కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా మీ కంప్యూటర్ నుండి WhatsApp సందేశాలను పంపడానికి మరియు స్వీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మల్టీ-డివైస్ ఫంక్షనాలిటీ వినియోగదారులు తమ ఫోన్లో వాట్సాప్‌ను అలాగే నాలుగు ఇతర నాన్-స్మార్ట్‌ఫోన్ పరికరాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు ఒకే సమయంలో రెండు వేర్వేరు మొబైల్ ఫోన్ లలో WhatsApp ను ఉపయోగించలేరని , అయితే వారు ఒకే సమయంలో WhatsApp web ను మాత్రం గరిష్టంగా నాలుగు PCలు లేదా టాబ్లెట్లను కనెక్ట్ చేయవచ్చు.
ఇంతకుముందు, ఇంతకుముందు WhatsApp web వినియోగదారులు తమ ఫోన్‌ను ఇంటర్నెట్కి లింక్ చేయవలసి ఉంటుంది. ఇకపై ఉండదు మరియు వినియోగదారులు తమ ఫోన్‌ను ఇంటర్నెట్కి లింక్ చేయాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్ వెబ్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు.
ఈ వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ! (krishijagran.com)
రాగి పాత్రలలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి. (krishijagran.com)
Share your comments