Health & Lifestyle

క్యాన్సర్‌ని తరిమికొట్టే తెల్ల మిరియాలు.. ఎలా అంటే?

KJ Staff
KJ Staff

భారతీయ వంటకాల్లో మిరియాలకు ప్రముఖ స్థానం ఉంది.సుగంధ ద్రవ్యాలలో రారాజుగా వెలుగొందుతున్న మిరియాలు ఆహారంలో రుచిని ఇవ్వడంతోపాటు మన శరీరానికి అవసరమైన విటమిన్ సి,కె, కాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం, ఫైబర్, ఐరన్, కాపర్, మాంగనీస్ మొదలైన మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధకశక్తి సమృద్ధిగా లభిస్తుంది.

సాధారణంగా మిరియాలు నలుపు, తెలుపు రంగుల్లో లభ్యమవుతాయి.వంటలలో నల్ల మిరియాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు.తెల్ల మిరియాలను బాగా పక్వానికి వచ్చిన పెప్పర్ బెర్రీ నుంచి సేకరిస్తారు. తెల్ల మిరియాలకు భారతీయ ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. తెల్ల మిరియాల పొడిని వేయించిన బియ్యంతోపాటు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తెల్ల మిరియాల్లో యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉండడంతో అనేక వ్యాధికారక సూక్ష్మజీవులు నుంచి రక్షణ కల్పించి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. తెల్ల మిరియాలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను నివారించి గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.

తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ పుష్కలంగా ఉంటుంది. క్యాప్సైసిన్ కంటెంట్ శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ను నయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే క్యాప్సైసిన్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine