Health & Lifestyle

పరగడుపున ఒక్క గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు మొత్తం కరిగి పోతుంది..?

KJ Staff
KJ Staff

టమాటోను ప్రతి రోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో భాగం చేసుకోవడం వల్ల టమాటాలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, క్యాల్షియం మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధులను దూరం చేస్తుందన్న విషయం తెలిసిందే.అయితే తాజా అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాసుడు టమోటో జ్యూస్ తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో టమోటో అద్భుతంగా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

టమాటో కొలెస్ట్రాల్ కరిగించడంలో ఏవిధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. టమాటాలో సహజంగానే సోడియం,కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. దానికి తోడు టమాటాలు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. లైకోపిన్ ఆక్సిడెంట్ ఎల్ డి ఎల్, ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కావున ప్రతి రోజు టమోటో జ్యూస్ ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గి ప్రమాదకర గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు.

ప్రతిరోజు టమోటో జ్యూస్ లేదా టమోటోను ఆహారంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది తద్వారా మధుమేహం వ్యాధికి దూరంగా ఉండవచ్చు.టమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడ అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న టమాటా ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే సహజసిద్ధంగా అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

Share your comments

Subscribe Magazine