మారిన జీవనశైలి తో మారిన ఆహారపు అలవాట్లు నేటి తరం యువతను మరియు మధ్య వయస్సు వారిని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నాయి , ఎక్కువ శాతము బయటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం లేదు మరియు మధుమేహం ,రక్త పోటు కు దారితీస్తున్నాయి అయితే ఆహారం లో ప్రతిరోజు ఖర్జూర పండును చేర్చుకోవడం వల్ల మన రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఈ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
ఖర్జూర పండులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వీటిని తినడానికి చాలా ఇష్టపడతారు. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధిని నివారిస్తాయి. ముఖ్యంగా ఎవరైనా ఆహారం తిన్న తర్వాత.. ఏదైనా తినాలనిపించినప్పుడు కచ్చితంగా ఖర్జూర పండును తినడం చాలా మంచిదట.
ఇక ఎముకలు బలంగా లేనివారు ఖర్జూర పండ్లు తినడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం వల్ల ఎముకల లోపల ఉండే గుజ్జు చాలా బలంగా పెంచడానికి సహాయపడుతుంది. ఇక అంతే కాకుండా ఇందులో క్యాల్షియం,ఐరన్ వంటివి పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు చాలా బలంగా తయారవుతాయి.
దగ్గు, ఆస్తమా ఉంటే ఏ పండ్లు తినవచ్చు !
ముఖ్యం గత మధుమొహాన్ని నియంత్రించడానికి ప్రతి ఒక్కరు కూడా ఖర్జూర పండును తినడం చాలా మంచిది. ఇది మన శరీరంలోని షుగర్ లెవల్సిని అదుపులో ఉండే గుణాలు అధికంగానే ఉంటాయి. షుగర్ ఉన్నవారు వీటిని ఒకటి కంటే ఎక్కువ తినకూడదు. ఖర్జూరాలలో ఎక్కువగా పోటాస్ ఉండడం వల్ల రక్తపోటు సమస్యతో బాధపడేవారు వీటిని తినవచ్చు. ఇక అంతే కాకుండా గుడ్డే జబ్బులతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు వీటిని తింటూ ఉండడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.
Share your comments